వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పక్కా ప్లాన్, సీఎం విశ్వాస తీర్మాణం వాయిదా, గవర్నర్ డెడ్ లైన్ పట్టించుకోలేదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు కాంగ్రెస్ నాయకులు ముందుగా అనుకున్నట్లే వాయిదా వేయించడంలో సక్సస్ అయ్యారు. శుక్రవారం మద్యాహ్నం 1.30 గంటల లోపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని గవర్నర్ స్వయంగా సూచించినా ఫలితం మాత్రం మారలేదు. శుక్రవారం మద్యాహ్నం 3 గంటలకు సభా వాయిదే విసిన స్పీకర్ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ కావాలని సమయం కోరారు. బీజేపీ నాయకులు సైతం గవర్నర్ కలవడానికి సిద్దం అవుతున్నారు.

శాసన సభ సమావేశం ఎందుకు వాయిదా వేశాము, మద్యాహ్నం 1.30 గంటల లోపు సీఎం అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశ పెట్టలేకపోయారు అని స్పీకర్ రమేష్ కుమార్ గవర్నర్ వాజూబాయ్ వాలాకు వివరించనున్నారని తెలిసింది. అనుకున్న సమయానికి సీఎం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టలేకపోయిన కారణాలను స్పీకర్ రమేష్ కుమార్ గవర్నర్ కు చర్చించనున్నారని తెలిసింది.

Karnataka Trust Vote: The house has been adjourned till 3 pm today

సభలో కాంగ్రెస్ నాయకుల చర్చకు అవకాశం ఇవ్వాలని పదేపదే పట్టుబట్టారు. సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ రమేష్ కుమార్ సభను వాయిదా వేశారు. గవర్నర్ శాసన సభా సమావేశాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ఆరోపిస్తూ గవర్నర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

గతంలో మెజారిటీ నిరూపించుకోవాలని 15 రోజులు యడ్యూరప్పకు గవర్నర్ అవకాశం ఇచ్చారని, ఇప్పుడు అదే గవర్నర్ 10 గంటలు తమకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిచారు. చట్టపరంగా శాసన సభా సమావేశాల్లో గవర్నర్ జోక్యం చేసుకోరాదని మంత్రి కృష్ణభైరే గౌడ అభ్యంతరం వ్యక్తం చేశారు.

విధాన సౌధలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవిశ్వాస తీర్మాణం సోమవారానికి వాయిదా పడే అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం మద్యాహ్నం వరకే శాసన సభా సమావేశాలు జరిగే అవకాశం ఉందని, శని, ఆదివారాలు సెలవు కావడంతో చాల మంది ఎమ్మెల్యేలు వారి సొంత ఊర్లకు వెళ్లడానికి సిద్దం అవుతున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య చెప్పారు.

English summary
The house has been adjourned till 3 pm today. Even as there’s din in the house as BJP presses for division and coalition for discussion, the voting for the floor test has been delayed by the Speaker till the time debate is summarised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X