వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక స్థానిక ఎన్నికలు లైవ్ అప్‌డేట్స్: శివమొగ్గలో బీజేపీ హవా, కల్బుర్గిలో కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో 102 లోకల్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆగస్ట్ 31వ తేదీన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ జరిగింది. కల్బుర్గిలో ఈవీఎంలను భద్రపరిచారు. సోమవారం (03-09-2018) ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

 karnataka ulb poll results live updates: Congress-JD(S) join hands in Mysore, Tumakuru

మైసూరు, తుమకూరులలో జేడీఎస్, కాంగ్రెస్‌లు చేతులు కలిపే అవకాశముంది. కల్బుర్గి జిల్లాలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది.

మైసూరు జిల్లాలో పెరియపెంట పంచాయతీ జేడీఎస్ గెలుచుకోనుంది. దక్షిణ కన్నడలో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఉంది. శివమొగ్గ సీఎంసీని బీజెపి గెలుచుకుంది. 35 సీట్లకు గాను బీజేపీ 20 స్థానాల్లో గెలిచింది.

27 సీట్లు ఉన్న షహబాదులో కాంగ్రెస్ 18 సీట్లు, బీజేపీ 5, జేడీఎస్ 1 గెలుచుకుంది.

జెవార్గిలో బీజేపీ 17 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్, జేడీఎస్‌లు చెరీ మూడు సీట్లు గెలుచుకున్నాయి.

అలంద్‌లో 27 సీట్లకు గాను కాంగ్రెస్, బీజేపీలు చెరీ 13 సీట్లు గెలుచుకోగా, జేడీఎస్ 1 సీటు గెలుచుకుంది.

హసన్‌లో జేడీఎస్ ముందంజలో ఉంది. ఉడిపిలో బీజేపీ దూసుకు పోతోంది. ఇక్కడ 35 సీట్లకు గాను బీజేపీ 31 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలుచుకుంది.

102 స్థానాలలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 560, బీజేపీ 499, జేడీఎస్ 178, స్వతంత్రులు 150 సీట్లు గెలుచుకున్నారు.

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్ట్ 31వ తేదీన ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపాలిటీలు, 53 పట్టణ మున్సిపాలిటీలు, 23 పట్టణ పంచాయతీలు, మూడు సిటీ కార్పొరేషన్లలోని 135 వార్డులను కలుపుకొని మొత్తం 2,664 వార్డుల్లో పోలింగ్ జరిగింది.

105 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కొడగు జిల్లాలో మెరుపు వర్షాలు, వరదల కారణంగా మూడు సోమ్వార్‌పేట్, విరాజ్‌పేట్, కుషాల్‌నగర్‌లో ఎన్నికలను వాయిదా వేశారు.

English summary
The ruling coalition partners Congress, Janata Dal Secular and Bahujan Samaj Party have garnered nearly 50 per cent of the total seats declared so far with Congress bagging highest number of seats in the urban local bodies, results of which have started coming in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X