బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరుపై ఆ నిర్ణయం సరికాదు.. యడియూరప్ప సర్కార్ వాదన ఇదీ..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను పొడగించిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి జోన్ల వారీగా కొన్ని సడలింపులు,మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెడ్ జోన్లలో ఎలాంటి యాక్టివిటీకి అనుమతివ్వలేదు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌లు రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. అయితే బెంగళూరు నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి ఎనకమిక్ యాక్టివిటీకి అవకాశం కల్పించాలని కర్ణాటక సర్కార్ కేంద్రాన్ని కోరనుంది.

'దాదాపు కోటి మంది జనాభా పైగా ఉన్న నగరం మొత్తాన్ని ఒకే గాటున కట్టి రెడ్ జోన్‌గా ప్రకటించడం సరికాదు. చాలా జిల్లాల్లో రెడ్‌ జోన్లను కంటోన్మెంట్లకే పరిమితం చేసి సడలింపులనిచ్చారు. కాబట్టి బెంగళూరులోనూ ఎకనమిక్ యాక్టివిటీస్‌కు అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకోవాలి.దీనిపై కేంద్రాన్ని స్పష్టత కోరుతాం' అని రెవెన్యూ మంత్రి అశోక అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి యడియూరప్ప నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Karnataka wants relaxed zones within Bengaluru for economic activities

ఇది కేవలం ఎకనమిక్ యాక్టివిటీస్ కోసం మాత్రమే కాదని,ప్రజల కోసమని అశోక పేర్కొన్నారు. బెంగళూరులో చిక్కుకుపోయిన వలస కార్మికులు,విద్యార్థులు,టూరిస్టులను తరలించేందుకు.. వారికి వన్డే పాస్ అందజేస్తున్నామన్నారు. జిల్లాల మధ్య ప్రయాణానికి ఇది అనుమతిస్తుందన్నారు.

Recommended Video

Normal Monsoon This Year, June-July May See Less Rains

'నేను బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జిని. అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నేలమంగళ,హోస్కోటె,దొడ్డబళ్లాపుర వంటి పెద్ద జిల్లాలన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆరెంజ్ జోన్‌గా ప్రకటించాలి. షాపులు నిర్వహించుకోవడానికి,ఫోర్ వీలర్స్,టూ వీలర్స్‌కు అనుమతినివ్వాలి.' అని అశోక అభిప్రాయపడ్డారు.

English summary
The Karnataka government will seek permission from the centre to divide Bengaluru Urban-categorised as a red-zone district by Union Health Ministry-into four zones to allow easing of lock down restrictions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X