వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు పిల్లలకు తల్లయినా.. తగ్గని మోజు: అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్త హత్య: చివరికి.. !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. 45 సంవత్సరాల వయస్సులో అక్రమ సంబంధాన్ని నెరపింది. ఈ అక్రమ సంబంధానికి కట్టుకున్న భర్తే అడ్డుగా ఉన్నాడని భావించింది. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపించింది. నాటకీయ ఫక్కీలో పోలసుల చేతికి చిక్కింది. ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు తాలూకాలో చోటు చేసుకున్న ఘటన ఇది. పోలీసులను సైతం నివ్వెర పోయేలా చేసిన ఉదంతం ఇది.

ఉరితీతకు లైన్ క్లియర్: నిర్భయ దోషుల క్యురేటివ్ పిటీషన్లు కొట్టిపారేసిన కోర్టు: తెలుగు న్యాయమూర్తి..!ఉరితీతకు లైన్ క్లియర్: నిర్భయ దోషుల క్యురేటివ్ పిటీషన్లు కొట్టిపారేసిన కోర్టు: తెలుగు న్యాయమూర్తి..!

15 సంవత్సరాల కిందట వివాహం..

15 సంవత్సరాల కిందట వివాహం..

నిందితురాలి పేరు రూప. మద్దూరు తాలూకా పరిధిలోని రాజేగౌడన దొడ్డి గ్రామంలో భర్త రంగస్వామి, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. చామరాజ నగర జిల్లా రామపుర గ్రామానికి చెందిన రంగస్వామితో ఆమెకు 15 సంవత్సరాల కిందట వివాహమైంది. అనంతరం రంగస్వామి జీవనోపాధి కోసం తన కుటుంబంతో కలిసి రాజేగౌడన దొడ్డిలో నివసిస్తున్నాడు. ఆ గ్రామానికి సమీపంలోనే ఉన్న క్వారీలో పనిచేస్తున్నాడు.

అక్రమ సంబంధం కోసం అద్దెకు ఇల్లు..

అక్రమ సంబంధం కోసం అద్దెకు ఇల్లు..

మూడేళ్ల కిందట రూపకు అదే గ్రామానికి చెందిన ముత్తురాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అక్రమ సంబంధానికి దారి తీసింది. విధి నిర్వహణలో భాగంగా రంగస్వామి తరచూ బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సి రావడంతో వారిద్దరి అక్రమ సంబంధానికి అడ్డు లేకుండా పోయింది. రూప, ముత్తురాజు తరచూ చందేహళ్లి దొడ్డి గ్రామంలో కలుసుకునే వారు. రూప కోసం ముత్తురాజు చందేహళ్లి దొడ్డిలో ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు.

పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా..

పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా..

భార్య అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోన్న విషయం రంగస్వామికి దృష్టికి వచ్చింది. దీనితో అతను భార్య ప్రవర్తనపై నిఘా వేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా రూప, ముత్తురాజులను పట్టుకున్నాడు. వారి వ్యవహారంపై మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూప, ముత్తురాజులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమ అక్రమ సంబంధం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లడంతో రూప, ముత్తురాజు ఆగ్రహానికి గురయ్యారు.

భర్తకు మద్యాన్ని తాగించి..

భర్తకు మద్యాన్ని తాగించి..

తమకు అడ్డంకిగా ఉంటోన్న రంగస్వామిని హతమార్చాలని పథకం పన్నారు. రంగస్వామికి పీకల్దాకా మద్యాన్ని తాగించారు. గొంతు నులిమి మత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చందేహళ్లి దొడ్డి అటవీ ప్రాంతంలోని ఓ చెరువులో పడేశారు. అనంతరం ఆమె తన భర్త కనిపించట్లేదంటూ మద్దూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రియుడితో సహజీవనం..

ప్రియుడితో సహజీవనం..

భర్తను హత్యానంతరం రూప తన పెద్ద కుమారుడిని హాస్టల్‌లో చేర్పించింది. మిగిలిన ఇద్దరు పిల్లలతో కలిసి మద్దూరుకు నివాసాన్ని మార్చింది. భర్త అడ్డు తొలగిపోవడంతో ఆమె ముత్తురాజుతో కలిసి మద్దూరులోనే సహజీవనాన్ని ఆరంభించింది. మరోవంక- రంగస్వామి కనిపించట్లేదంటూ దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టినప్పటికీ.. రంగస్వామి హత్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఏదీ వారికి కనిపించలేదు.

Recommended Video

Disha Act :IAS Kritika Shukla Speaks To Media Over Implementation Of Disha Act
పోలీసుల దర్యాప్తులో గుట్టురట్టు..

పోలీసుల దర్యాప్తులో గుట్టురట్టు..

దీనితో అనుమానం రూప పైకి మళ్లింది. ఈ నెల 10 తేదీన ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయాన్ని అంగీకరించింది. ముత్తురాజుతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకొంది. దీనితో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వారిద్దరి మండ్య న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు.

English summary
Women killed her husband with the help of lover in Mandya district of Karnataka. Police arrest the women and her lover after one year investigation. The incident happened at Raje Gowdana Doddi in Maddur Taluk of Mandya district, Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X