బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెబల్ స్టార్ ను చూసి సూపర్ స్టార్ కన్నీరు, ప్రాణ స్నేహితుడు, యుద్దవిమానంలో మండ్యకు, హైఅలర్ట్ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ambareesh : అంబరీష్ చివరి చూపుకోసం తరలి వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు | Oneindia Telugu

బెంగళూరు: స్యాండిల్ వుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ అంబరీష్ ఇక మనమధ్యలేరని జీర్ణించుకోలేకపోతున్నానని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అవేదన వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప స్నేహితుడు తనకు దూరం అయ్యారని రజనీకాంత్ కన్నీరు పెట్టుకున్నారు. బెంగళూరులో ఆదివారం సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ప్రాణస్నేహితుడు రెబల్ స్టార్ అంబరీష్ మృతేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రజనీకాంత్ ఉద్వేగానికిలోనయ్యారు.

ధైర్యం చెప్పిన తలైవా !

ధైర్యం చెప్పిన తలైవా !

రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, బహుబాష నటి సుమలత, వారి కుమారుడు అభిషేక్ ను ఓదార్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ వారిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. ఎంతో కాలంగా రజనీకాంత్, అంబరీష్ ప్రాణస్నేహితులు. అంతకు ముందే రజనీకాంత్ అంబరీష్ కు ట్వీట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. తన ప్రాణస్నేహితుడు ఇక లేడు అనే సమాచారం వచ్చింది. నీవు ఎక్కడ ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.

మండ్యలో హైటెన్షన్

మండ్యలో హైటెన్షన్

మండ్య ముద్దుబిడ్డ అని పిలుపించుకునే రెబల్ స్టార్ అంబరీష్ మరణంతో ఆ జిల్లాలోని ప్రజలు, అభిమానులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. అంబరీష్ మృతదేహాన్ని మండ్యకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్వాప్తంగా ఆయన అభిమానులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. రెంబల్ స్టార్ అంబరీష్ మృతదేహాం మండ్యకు తీసుకురావాలని, అంతిమ దర్శనానికి అవకాశం కల్పించాలని ధర్నాలు, రాస్తారోకోలు చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితులు ఎదురైనాయి. పోలీసులు, స్థానిక నాయకులు, అధికారులు అంబరీష్ అభిమానులకు నచ్చచెబుతున్నారు.

కేంద్రంతో సీఎం చర్చలు

కేంద్రంతో సీఎం చర్చలు

మండ్య జిల్లాలోని పరిస్థితి తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చలు జరిపారు. యుద్దవిమానంలో అంబరీష్ మృతదేహాన్ని మండ్య తరలించడానికి అవకాశం ఇవ్వాలని సీఎం కుమారస్వామి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మనవి చేశారు.

యుద్దవిమానం

యుద్దవిమానం

అంబరీష్ మృతదేహాన్ని యుద్దవిమానంలో మండ్యకు తరలించడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పంధించారని సీఎం కుమారస్వామి మీడియాకు చెప్పారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో యుద్దవిమానంలో అంబరీష్ మృతదేహాన్ని మండ్యకు తరలించనున్నారు. మండ్యలోని శ్రీ విశ్వేశ్వరయ్య స్టేడియంలో అంబరీష్ అంతిమ దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు శాంతియుతంగా ఉండాలని సీఎం కుమారస్వామి మనవి చేశారు.

బెంగళూరు, మండ్యలో రెడ్ అలర్ట్

బెంగళూరు, మండ్యలో రెడ్ అలర్ట్

రెబల్ స్టార్ అంబరీష్ అకస్మిక మరణంతో బెంగళూరు నగరంతో సహ మండ్య జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. డాకర్ట్ రాజ్ కుమార్, డాకర్ట్ విష్ణువర్డన్ మరణించిన సమయంలో జరిగిన అల్లర్లు మళ్లీ జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభిమానుల ముసుగులో సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పడేవారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దం అయ్యారు.

English summary
Veteran actor and politician Ambarish who was a close companion of superstar Rajinikanth passed away at the age of 66. The actor was admitted to the Bengaluru hospital where he breathed his last.Karnataka Chief minister H.D.Kumaraswamy has assured that the government is trying to lift Ambareesh body to Mandya through defence helicopter by Sunday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X