• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్తపూర్ పై పాక్ డబుల్ గేమ్: అది ఉంటేనే భారతీయులను గురుద్వారకు అనుమతిస్తాం

|

న్యూఢిల్లీ: కర్తాపూర్ కారిడార్ అధికారిక ప్రారంభానికి ఇంకా మూడురోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోంది. దర్బార్ సాహిబ్ గురుద్వారా సందర్శనకు వెళ్లే సిక్కుల పాస్‌పోర్టులకు సంబంధించి రోజుకో గందరగోళ ప్రకటన చేస్తోంది.

అప్పుడు వద్దన్నారు..ఇప్పుడు ఉండాలంటున్నారు

అప్పుడు వద్దన్నారు..ఇప్పుడు ఉండాలంటున్నారు

పాకిస్తాన్‌లోని నారోవాల్ జిల్లాలో ఉన్న కర్తాపూర్‌కు వెళ్లే భారతీయ భక్తులకు పాస్‌పోర్టు అక్కర్లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే భక్తులకు పాస్‌పోర్టు మినహాయింపు లేదంటూ ఆదేశ మిలటరీకి సంబంధించిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ వ్యాఖ్యానించారు. దీంతో సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారత్‌కు చెందిన సిక్కులు ఆందోళన చెందుతున్నారు.

 భద్రతాపరమైన అడ్డంకులు ఉన్నాయి: ఆసిఫ్ గఫూర్

భద్రతాపరమైన అడ్డంకులు ఉన్నాయి: ఆసిఫ్ గఫూర్

భారత్‌లో నివసిస్తున్న సిక్కులు కర్తాపూర్‌లోని గురుద్వారాను సందర్శించాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్టు కలిగి ఉండాలని అన్నారు. భద్రతాపరమైన అడ్డంకులు ఉన్నందున పాస్‌పోర్టు చూపిస్తేనే సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి అడుగుపెట్టనిస్తామని గఫూర్ వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరమైన అంశాలు తలెత్తినప్పుడు ఎక్కడా రాజీ పడేది లేదని గఫూర్ చెప్పారు. సిక్కు మత వ్యవస్థాపకులు మతగురువు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా కర్తాపూర్ కారిడార్‌ను శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. కర్తాపూర్‌‌లో గురునానక్ దేవ్ చివరిరోజులు గడిపినట్లు చరిత్ర చెబుతోంది.

స్వయంగా పాక్ ప్రధానే చెప్పారు

స్వయంగా పాక్ ప్రధానే చెప్పారు

ఇదిలా ఉంటే వీసా లేకుండానే భారత్‌లో నివసించే సిక్కులకు కర్తాపూర్‌కు వచ్చే వెసులుబాటు కల్పించింది పాక్. అయితే పాస్‌పోర్టు ఉండాలని ముందుగా చెప్పగా.. ఆ తర్వాత పాస్‌పోర్టు అక్కర్లేదంటూ స్వయంగా ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. ఇదే విషయమై ఆయన ట్విటర్‌లో కూడా పోస్టు చేశారు. మరోవైపు 10 రోజులు ముందుగానే అంటే అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా ఆ రోజు ప్రవేశ రుసుం కూడా రద్దు చేస్తామని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. కానీ పాక్ ఆర్మీ మాత్రం సమయం దగ్గర పడుతున్న క్రమంలో పాస్‌పోర్టు తప్పనిసరి అంటూ చెప్పి సిక్కుల్లో మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.

 భద్రతను సమీక్షించిన భారత అధికారులు

భద్రతను సమీక్షించిన భారత అధికారులు

ఇదిలా ఉంటే కర్తాపూర్ కారిడార్‌ను ఇస్లామాబాదులోని భారత హైకమిషన్ అధికారులు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. గురునానక్ జయంతి రోజున భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కర్తాపూర్‌ను సందర్శించనున్న నేపథ్యంలో అక్కడి భద్రతా చర్యలపై మానిటర్ చేశారు. కర్తాపూర్‌ సందర్శనకు వచ్చే భారతీయ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత పాకిస్తాన్ తీసుకోవాలని భారత అధికారులు కోరినట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Just three days ahead of the official inauguration of the much-awaited Kartarpur Corridor, Pakistan is giving confusing signals on the passport requirement for Indian pilgrims wishing to visit Gurudwara Darbar Sahib.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more