• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కార్తీ చిదంబరం అరెస్ట్: అవినీతిని సహించమని బీజేపీ, కక్షపూరితమని కాంగ్రెస్

|

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్ట్ చేసి తాము అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్డీఏ ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అవినీతి పరులకు వత్తాసు పలుకుతోందని రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నట్లు నేపథ్యంలో కార్తీ చిదంబరం అరెస్ట్ సంచలనంగా మారింది.

అవినీతిపరుల పట్ల నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలా తాము చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, కార్తీ చిదంబరం అరెస్ట్ కక్షపూరితంగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండటం గమనార్హం. కాగా, అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Karti arrested: Congress pushed on backfoot as BJP moves to regain anti-corruption mojo

మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం అరెస్ట్

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం బుధవారం అరెస్టయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసింది. బుధవారం ఉదయం లండన్‌ నుంచి చెన్నై చేరుకున్న కార్తిని ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుంది. ఆయన్ని ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచారం.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా అంశంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారని కార్తీపై ఆరోపణలు ఉన్నాయి. 2007లో చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసులో కార్తి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న అభియోగాలు నమోదయ్యాయి.

తెరపైకి కెనరా బ్యాంక్: రూ.515కోట్లు ఎగ్గొట్టిన ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్, ఇక్కడా బలైన పీఎన్బీ

గత మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు సహకరించడంలేదని కార్తీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మనీ లాండరింగ్‌ కేసులో మంగళవారం కార్తికి చెందిన సీఏ ఎస్‌. భాస్కరరామన్‌కు ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీని విధించిన విషయం తెలిసిందే. కాగా, కేసును తప్పుదోవ పట్టించేందుకు కార్తీ చిదంబరం ప్రయత్నిస్తున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నామని సీబీఐ పేర్కొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karti Chidambaram's arrest could be an inflection point in the Bharatiya Janata Party's (BJP) attempt to regain the narrative against corruption. For a party which came into power on the back of a promise to clean the swamp and take action against the kingpins behind the UPA's scam-tainted regime, the Narendra Modi government's four-year stint at the Centre has been quite an anti-climactic experience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more