• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కార్తీ చిదంబరం కేసులో ఓ శక్తిమంతమైన నేత! ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి, సుప్రీంలో కార్తీ అప్పీలు...

By Ramesh Babu
|

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తులో సంచలన విషయం వెల్లడైంది. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతుల మంజూరు కోసం ముడుపులు చెల్లించినట్లు ఇంద్రాణీ ముఖర్జియా సాక్ష్యమిచ్చిన నేపథ్యంలో ఈడీ మరిన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

  INX Media Case : Karti Chidambaram in CBI Custody | Oneindia Telugu

  ఈ కేసులో ఓ శక్తిమంతమైన రాజకీయ నేత ప్రమేయం కూడా ఉందని, ఆయన బ్యాంకు ఖాతాకు కార్తీ చిదంబరం రూ.1.8 కోట్లు జమ చేసినట్లు ఆధారాలు దొరికాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. చెన్నైలోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ శాఖలోని తన ఖాతా నుంచి కార్తీ ఈ సొమ్మును ఆ రాజకీయ నేత ఖాతాకు బదిలీ చేసినట్లు తెలిపాయి. మరోవైపు ఈడీ దర్యాప్తుపై కార్తీ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

   ఇంద్రాణీ ముఖర్జియా ఏం చెప్పిందంటే

  ఇంద్రాణీ ముఖర్జియా ఏం చెప్పిందంటే

  ఐఎన్ఎక్స్ మీడియా టెలివిజన్ కంపెనీని పీటర్, ఇంద్రాణీ ముఖర్జియా కలిసి ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో విదేశీ పెట్టుబడుల కోసం అనుమతి పొందేందుకు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరంతో నార్త్ బ్లాక్‌లో సమావేశమైనట్లు ఇంద్రాణీ తన వాంగ్మూలంలో తెలిపారు. ఇందుకు బదులుగా తన కుమారుడు కార్తీ వ్యాపారాలకు సహాయపడాలని చిదంబరం తమను కోరారని ఇంద్రాణీ ఈడీ విచారణలో వెల్లడించారు.

  ఎవరా సీనియర్ రాజకీయ నేత?

  ఎవరా సీనియర్ రాజకీయ నేత?

  చెన్నైలోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ శాఖలోని తన ఖాతా నుంచి కార్తీ చిదంబరం ఓ రాజకీయ నేత ఖాతాకు రూ.1.8 కోట్లు జమచేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కార్తీ నుంచి ఈ సొమ్మును స్వీకరించిన ఆ రాజకీయ నేత ఎవర్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సదరు రాజకీయ నేత పేరు, ఇతర వివరాలను మాత్రం ఈడీ వెల్లడించలేదు. అలా చేస్తే తమ దర్యాప్తుకు తీవ్ర ఆటకం ఏర్పడుతుందని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సదరు నేతకు దశాబ్దాల రాజకీయ జీవితం ఉందని, ఆయన కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారనే వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి.

  కస్టడీ గడువు పెంపునకు సీబీఐ యోచన...

  కస్టడీ గడువు పెంపునకు సీబీఐ యోచన...

  మరోవైపు కార్తీ చిదంబరం కస్టడీని పొడిగించాలని సీబీఐ కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంను గత నెల 28న చెన్నై విమానాశ్రయంలో సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ కోర్టు ఆయనకు ఈ నెల 6 వరకు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. ఇంద్రాణి ముఖర్జీతో పాటు బైకుల్లా జైలులో కార్తీని ప్రశ్నించిన అనంతరం, ఆయనను ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే కార్తీని మరింత లోతుగా విచారించేందుకు ఇంకాస్త గడువు అవసరమని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు సీబీఐ ఆయన కస్టడీని పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరబోతోంది.

   ఈడీపై సుప్రీంను ఆశ్రయించిన కార్తీ...

  ఈడీపై సుప్రీంను ఆశ్రయించిన కార్తీ...

  కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ.. ఆయన సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ అధికారాన్ని కార్తీ సవాల్‌ చేశారు. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయని విషయాలపై సీబీఐ, ఈడీలు తనను ప్రశ్నిస్తున్నాయని కార్తీ చిదంబరం తన పిటిషన్‌లో ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువేనని, రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని కార్తీ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రేపు వాదనలు విననుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Enforcement Directorate’s probe into the alleged money laundering case against Karti Chidambaram may have entered a volatile stretch with officials at the agency claiming that investigators have found details of him transferring Rs 1.8 crore into the bank account of an influential political figure.ED officials conversant with the progress of the politically sensitive probe against the son of former finance minister P Chidambaram alleged that Karti transferred the money from his account in the Chennai branch of Royal Bank of Scotland (RBS). They said the recipient has discharged very important responsibilities at the Centre in a career spanning decades, but declined to disclose his identity on the grounds that doing so could hamper their investigation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more