• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిఎంకెలో నాయకత్వ మార్పు, స్టాలిన్ కు బాద్యతలు, అళగిరికి ఏం ఇస్తారు

By Narsimha
|

చెన్నై:జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో చకచక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.డిఎంకె పార్టీ డిసెంబర్ 20వ, తేదిన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో డిఎంకె యువనేత స్టాలిన్ కు పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణమాలను చర్చించనుంది ఆ పార్టీ.

 డిసెంబర్ 20వ, తేదిన కీలక సమావేశం

డిసెంబర్ 20వ, తేదిన కీలక సమావేశం

డిఎంకె పార్టీలో కొంత కాలంగా వారసత్వపోరు సాగుతోంది. డిఎంకె తన తనయులలో అళగిరి కంటే, స్టాలిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని అళగిరి మద్దతుదారులు భావిస్తున్నారు. అళగిరి కూడ ఇదే అభిప్రాయంతో ఉండేవాడు. అయితే తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని కరుణానిధి ప్రకటించారు.జయలలిత మరణంతో రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పరిస్థితులను అంచనావేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకొంటుంది డిఎంకె.పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ఎంపిలు, ఎంఏల్ఏలు , ఇతర నాయకులతో డిసెంబర్ 20వ, తేదిన డిఎంకె అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహరచనను ఖరారు చేయనుంది.

స్టాలిన్ పట్టాభిషేకం

స్టాలిన్ పట్టాభిషేకం

డిఎంకె పార్టీ కోశాధికారిగా ఉన్న స్టాలిన్ కు పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. జయ మరణించారు. కరుణానిధి ఆరోగ్యం కూడ సహకరించని పరిస్థితులు కన్పిస్తున్నాయి. దరిమిలా డిఎంకె పార్టీ బాధ్యతలను స్టాలిన్ కు అప్పగించేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నాలను సాగిస్తున్నట్టు సమాచారం. కరుణానిధి అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలు కొన్నింటిని అర్థాంతరంగా నిలిచిపోయిన పరిస్థితులున్నాయి. అన్నాడిఎంకె పార్టీలో కూడ మార్పులు చోటుచేసుకొంటున్నాయి. పార్టీని అన్నీ తానై నడిపిన జయలలిత మరణించడంతో ఆమె స్థానంలో శశికళ పార్టీ బాద్యతలను నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. అయితే డిఎంకె లో కూడ యువ నాయకుడు స్టాలిన్ కు భాద్యతలను కట్టబెట్టే అవకాశం కన్పిస్తోంది. డిసెంబర్ 20వ, తేదిన జరిగే పార్టీ అత్మవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే స్టాలిన్ కు పగ్గాలను అప్పగించే అవకాశాలు కన్సిస్తున్నాయి.

 ఆళగిరి భవితవ్యమేమిటి

ఆళగిరి భవితవ్యమేమిటి

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా డిఎంకె పార్టీనుండి అళగిరిని స్సపెండ్ చేశారు. గత ఎన్నికల సందర్భంగా అళగిరి మద్దతుదారులు పరోక్షంగా అన్నాడిఎంకె కు మద్దతుగా నిలవడంతో డిఎంకె కు ఇబ్బందికర పలితాలు వచ్చాయి. ఈ పరిణామాలతో ఆలగిరిని పార్టీ నుండి తప్పించారు. అయితే పార్టీలోకి తిరిగి ఆళగిరిని తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. గతంలో అళగిరి ఏ ప్రాంతంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారో అదే ప్రాంతంలో అళగిరికి పార్టీ భాద్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తమిళనాడు ప్రాంతంలో పార్టీకి అళగిరిని ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 ప్రధాన కార్యదర్శి ఎవరు

ప్రధాన కార్యదర్శి ఎవరు

డిఎంకె అధినేత కరుణానిధి నుండి స్టాలిన్ కు ఏ రకమైన భాద్యతలను అప్పగించాలనే దానిపై చర్చసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలా అనే దానిపై పార్టీవర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. కరుణ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనను పార్టీ గౌరవాధ్యక్షుడిగా నియమించే అవకాశాలను కూడ పరిశీలిస్తున్నాయి. డిఎంకె పార్టీ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్భళగన్ కూడ పదవి నుండి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో దురైమురుగన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. మొదటి నుంి ఆయన స్టాలిన్ తోనే ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
dmk plan to meeting on december 20th 2016, this meeting for given to party leadership resposibilities to stalin instead of karunanidhi. south region of tamilnadu alagiri is the incharge. dec 20 th party meeting decide all the changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more