చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియలు, ఆ ఇద్దరికి మధ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రిగా పనిచేసిన జయలలిత సమాధి పక్కనే కరుణానిధిని ఖననం చేయనున్నారు.

కలైంజ్ఞర్ నేతలు, సిినీ ప్రముఖుల నివాళి (పిక్చర్స్)

మెరీనా బీచ్‌లో మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలితల సమాధులు ఉన్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కరుణానిధి అంత్యక్రియలు కూడా మెరీనాలో నిర్వహిస్తున్నారు. కరుణ రాజకీయ గురువు, డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, తన రాజకీయ ప్రత్యర్థి జయలలితల సమాధుల మధ్యలో కరుణానిధి సమాధి ఉండనుంది. డీఎంకే కోర్టుకు అందించిన సమాధి నమూనా ప్రణాళికలో అలాగే ఉంది.

Karunanidhi funeral: Begins final journey to Marina beach

కాగా, తొలుత అన్నాడీఎంకే ప్రభుత్వం మెరీనా బీచ్‌లో కరుణ అంత్యక్రియలకు అనుమతివ్వలేదు. మాజీ ముఖ్యమంత్రులకు స్థలం కేటాయించలేమని తెలిపింది. గాంధీ మండపం సమీపంలో రెండెకరాల స్థలం ఇచ్చింది. దీంతో డీఎంకే మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా వాద ప్రతివాదనల విన్న అనంతరం కోర్టు కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆదేశించింది.

ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలుఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు

కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది. కరుణానిధి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు డెరిక్ ఒబ్రెయిన్ హాజరయ్యారు. డీఎంకే కార్యకర్తలు వంద అడుగులు కరుణానిధి బ్యానర్‌తో అంతిమయాత్రలో పాల్గొన్నారు.

English summary
DMK cadres take out a procession with a 100 feet long banner with images of the Kalaignar. MK Stalin, Alagiri, Dayanidhi Maran and several other DMK leaders walk along with the casket of Karunanidhi and thousands of supporters towards the Marina Beach where the Kalaignar will be finally laid to rest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X