చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి ఆరోగ్యం వెరీ క్రిటికల్: ఆసుపత్రికి అభిమానులు, నేతల తాకిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉందని కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం వెల్లడించారు. దీంతో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద ఎవరు కనిపిస్తే వారితో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

క్రిటికల్‌గా కరుణానిధి ఆరోగ్యం: ఆసుపత్రికి గడ్కరీ, తరలివస్తున్న కార్యకర్తలుక్రిటికల్‌గా కరుణానిధి ఆరోగ్యం: ఆసుపత్రికి గడ్కరీ, తరలివస్తున్న కార్యకర్తలు

కరుణానిధి ఫొటోలను పట్టుకొని ఆయన కోసం కంటతడి పెడుతున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతుండటంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రికి భారీగా కార్యకర్తలు తరలి వస్తుండటంతో భద్రతను పెంచారు. దాదాపు 600 మంది పోలీసులు ఆసుపత్రి వద్ద 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Karunanidhi Health Latest Updates: Kalaignars condition declines, security increased outside Kauvery Hospital

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి మంగళవారం కావేరి ఆసుపత్రికి వచ్చి కరుణానిధిని చూశారు. కరుణ తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌, కూతురు కనిమొళితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Recommended Video

కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వివరించిన స్టాలిన్

ఆసుపత్రి బయట వేచి ఉన్న అభిమానులను కనిమొళి కలుసుకున్నారు. కరుణానిధి త్వరగానే కోలుకుంటారని, ఆయన కోసం ప్రార్థించాలన్నారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా ఆసుపత్రికి వచ్చారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్‌ ట్వీట్‌ చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని తీవ్ర కలత చెందానని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

English summary
Karunanidhi Health Latest Update: Security has been beefed up outside the Chennai-based Kauvery hospital, where thousands of DMK supporters have been camping since last night, when the news of his critical condition was released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X