చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాట ముగిసిన కరుణ శకం: తమిళనాడు పోలీసులు హైఅలర్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

    Karunanidhi Passes Away At The Age Of 94 ముగిసిన కరుణానిధి శకం

    చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం బాగా విషమించిందని కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి లోపల, బయట పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తమిళనాడు పోలీసులు హైఅలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కావేరీ ఆసుపత్రి వర్గాలు సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి కరుణ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

    కరుణానిధి ఆరోగ్యం వెరీ క్రిటికల్: ఆసుపత్రికి అభిమానులు, నేతల తాకిడికరుణానిధి ఆరోగ్యం వెరీ క్రిటికల్: ఆసుపత్రికి అభిమానులు, నేతల తాకిడి

    Newest First Oldest First
    6:48 PM, 7 Aug

    డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూశారు. దీంతో తమిళనాట కరుణ శకం ముగిసింది.
    6:39 PM, 7 Aug

    తమిళనాడు వ్యాప్తంగా నైట్ షో సినిమాలు రద్దు చేశారు.
    6:21 PM, 7 Aug

    కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసి కావేరీ ఆసుపత్రి ఎదుట ఓ అభిమాని తనను తాను తీవ్రంగా కొట్టుకున్నాడు. చాతి బాదుకున్నాడు. కాగా, రేపు, ఎల్లుండి తమిళనాడులో ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు.
    6:09 PM, 7 Aug

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి చెన్నై బయలుదేరారు. ఆమె రాత్రి గం.9.30 సమయంలో చెన్నై చేరుకోనున్నారని తెలుస్తోంది.
    5:58 PM, 7 Aug

    దుర్గా స్టాలిన్ గోపాలపురం వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నటి ఖుష్బూ కావేరీ ఆసుపత్రికి తరలి వచ్చారు.
    5:53 PM, 7 Aug

    కరుణానిధి కుటుంబ సభ్యులు గోపాలపురంలోని డీఎంకే అధినేత ఇంటికి తరలి వచ్చారు. వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కూతురు సెల్వి కూడా ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు.
    5:50 PM, 7 Aug

    కరుణానిధి ఆరోగ్యం క్షీణిస్తోందని కావేరీ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో వెక్కి వెక్కి ఏడుస్తున్న అభిమానులు, డీఎంకే కార్యకర్తలు.
    5:45 PM, 7 Aug

    సాయంత్రం ఆరు గంటల తర్వాత మద్యం దుకాణాలు మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
    5:34 PM, 7 Aug

    కావేరీ ఆసుపత్రిలోకి ఎవరికీ అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున కరుణ అభిమానులు, కార్యకర్తలు ఉండటం, భారీగా పోలీసులను మోహరించిన నేపథ్యంలో ఆసుపత్రిలోకి ఇతర పేషెంట్లను తీసుకోవడం లేదు. తర్వాత బుల్లెటిన్ రాత్రి ఎనిమిది గంటలకు విడుదల కానుందని చెబుతున్నారు.
    5:32 PM, 7 Aug

    చెన్నైలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కోలీవుడ్ ఈవెంట్స్ ఒకదాని వెనుక ఒకటి రద్దు చేసుకుంటున్నారు.
    5:25 PM, 7 Aug

    మేం చేయగలిగింది చేస్తున్నాం: వైద్యులు - కరుణానిధి ఆరోగ్యం విషయంలో తాము చేయగలిగింది చేస్తున్నామని వైద్యులు తెలిపారు. కరుణకు చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు.
    5:24 PM, 7 Aug

    రాత్రి ఏడున్నర గంటలకు కరుణానిధి హెల్త్‌పై మరోసారి బులెటిన్ విడుదల చేయనున్నారు. ఆసుపత్రికి భారీగా డీఎంకే కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఢిల్లీలో ఉన్న డీఎంకే రాజ్యసభ సభ్యులు, కీలక నేతలను చెన్నైకి రావాల్సిందిగా అన్నా అరివాలయం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులంతా చెన్నైకి రావాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
    5:23 PM, 7 Aug

    కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలయింది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని గంటలుగా అవయవాలు చికిత్సకు స్పందించడం లేదని తెలిపారు. తాము చికిత్స అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కావేరీ ఆసుపత్రి వద్ద ఉద్విగ్న, ఉద్వేగ వాతావరణం నెలకొని ఉంది. కావేరీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
    5:23 PM, 7 Aug

    డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ అయ్యారు. చీఫ్ సెక్రటరీ గిరిజ వైద్యనాథన్‌తోను భేటీ అయ్యారు. వరుస పరిణామాలు కరుణ అభిమానులు, డీఎంకే కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆసుపత్రి వద్దకు కరుణ కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు.
    5:22 PM, 7 Aug

    ఈ నేపథ్యంలో స్టాలిన్‌ ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు డీఎంకేకు చెందిన మరో ముగ్గురు సీనియర్‌ నేతలు కూడా వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. కరుణానిధి ఆరోగ్యం గురించి, ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి ముఖ్యమంత్రికి వివరించారు. గత రెండు రోజులుగా కరుణానిధి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం, ఈనేపథ్యంలో సీఎంతో స్టాలిన్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత సీఎస్‌తో భేటీ అయ్యారు. సీఎస్ కేంద్రం అధికారులతో చర్చించారని తెలుస్తోంది.
    5:20 PM, 7 Aug

    గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్య విషయంలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని వైద్యులు చెబుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని అంటున్నారు. గత రెండు రోజులుగా పరిస్థితి విషమంగా ఉంది.

    Karunanidhi Health Live Updates: DMK Chiefs Health Worsens, Heavy Police Deployment Inside Hospital
    English summary
    The condition of ailing DMK patriarch M Karunanidhi continues to remain critical, Kauvery Hospital's latest medical bulletin said as heavy police has been deployed inside.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X