వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణ ఆరోగ్యంపై మోడీ-చంద్రబాబు ఆరా, రేపు చెన్నైకి వెంకయ్య: వదంతులపై స్టాలిన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల

చెన్నై: డిఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆరా తీశారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీశారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు.

ఆయనను పలువురు నేతలు పరామర్శించారు. అన్నాడీఎంకే నేత పన్నీరుసెల్వం, ఏడీఎంకే నేత వైగో, ఇతర నేతలు ఆయన ఇంటికి వచ్చారు. జ్వరం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో కరుణ బాధపడుతున్నారు. కరుణానిధి ఆరోగ్యంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆరా తీశారు.

కరుణానిధిని చూసేందుకు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. గోపాలపురంలోని తన నివాసంలో ఆయన చికిత్స పొందుతున్నారు. 24 గంటలు ప్రత్యేక డాక్టర్లతో వైద్యసేవలు అందిస్తున్నారు. కరుణానిధిని కలిసేందుకు ఎవరినీ అనుమతించవద్దని వైద్యులు సూచించారు.

Karunanidhi health UPDATES: PM Modi wishes former Tamil Nadu CM speedy recovery

రేపు (శనివారం) ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెన్నైకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా ఫోన్లో పరామర్శించారని తెలుస్తోంది. తమిళనాడు మంత్రులు, నటుడు కమల్ హాసన్ తదితరులు పరామర్శించారు. కాగా, ఏమైనా వదంతులు ఉంటే నమ్మవద్దని కరుణ తనయుడు స్టాలిన్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన క్రమంగా కోరుకుంటున్నారని చెప్పారు. జ్వరం తగ్గుతోందన్నారు. కాగా పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. గోపాలపురంలోని నివాసానికి రావాలని చెప్పగా ప్రజాప్రతినిధులు వచ్చారు.

English summary
Former Tamil Nadu chief minister and DMK patriarch M Karunanidhi is being treated for fever due to urinary tract infection, according to a health bulletin issued by Kauvery hospital in Chennai on Thursday, which marked 49 years of the leader taking charge as the party chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X