వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణ కోలుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు లేఖ, రేపు ఆసుపత్రికి రజనీకాంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: కరుణానిధి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖను శ్రీలంక ఎంపీలు ఆర్ముగమ్ తొండైమన్, సెంథిల్ తొండైమన్‌లు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌కు అందించారు.

కరుణానిధిని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రేపు (మంగళవారం) పరామర్శించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ డెహ్రాడూన్ పర్యటనలో ఉన్నారు. రజనీ తన పర్యటన ముగించుకుని రేపు చెన్నైకు చేరుకోనున్నారు. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించేందుకు రేపు మధ్యాహ్నం అక్కడి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళిలను కావేరీ ఆసుపత్రిలో పరామర్శించారు. వారి తండ్రి కరుణ ఆరోగ్యంపై ఆరా తీశారు.

Karunanidhi health updates: Sri Lankan president hopes for DMK chiefs speedy recovery, sends letter to Stalin

కాగా, సోషల్ మీడియా వేదికగా కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ వదంతులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. పలువురిని విచారించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

నటి ఆగ్రహం

కరుణానిధి పేరును టీవీ యాంకర్లు పలుకుతున్న తీరుపై నిన్నటి తరం నటి శ్రీప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కరుణానిధి గురించి వార్తల్లో ప్రస్తావించేటప్పుడు ఆయనను ఏకవచనంతో సంబోధిస్తున్నారని శ్రీప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కరుణానిధిని కేవలం మాజీ ముఖ్యమంత్రి అని మాత్రమే పేర్కొంటున్నారన్నారు. వయస్సులో, హోదాలో ఉన్నతస్థితిలో ఉన్న కరుణను పేరుతో పాటు గారు చేర్చి మర్యాదపూర్వకంగా సంభోదించాలని యాంకర్లకు హితవు పలికారు.

English summary
Representatives of Sri Lanka President, Maithripala Sirisena, visited Kauvery hospital to meet former Tamil Nadu CM M Karunanidhi; submitted a letter from Sirisena to DMK working President MK Stalin wishing speedy recovery to Karunanidhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X