చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రిటికల్‌గా కరుణానిధి ఆరోగ్యం: ఆసుపత్రికి గడ్కరీ, తరలివస్తున్న కార్యకర్తలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లు ప్రకటన చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. కరుణ కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు.

వయోభారం కారణంగా చికిత్సకు శరీరం సహకరించడం లేదని తెలిపారు. 24 గంటల పాటు చికిత్సకు కరుణానిధి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని చెప్పారు. వైద్యులు ఆ ప్రకటన చేసినప్పటి నుంచే బంధువులు, మిత్రులు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వచ్చారు.

Karunanidhi LIVE updates: DMK stalwart critical, Nitin Gadkari visits Kauvery hospital

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు తమిళసాయి సౌందరరాజన్‌లు కావేరీ ఆసుపత్రికి చేరుకొని, కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆదివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆసుపత్రికి వచ్చారు. అంతకుముందు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చారు. కరుణ క్రిటికల్ సమయంలో కనిమొళి పక్కనే ఉన్నారు.

సోమవారం రాత్రి వైద్యులు మాట్లాడుతూ... అతని వయస్సు కారణంగా చికిత్స అందించడం ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. అతనిని నిరంతరం అత్యున్నత వైద్య నిపుణుల బృంద పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. వచ్చే ఇరవై నాలుగు గంటల తర్వాతే ఏదైనా చెప్పగలమన్నారు.

English summary
Union road and transport minister Nitin Nitin Gadkari visited the Kauvery hospital in Chennai on Monday. Karunanidhi's health has declined and the next 24 hrs are crucial, says a latest medical bulletin by the Kauvery hospital. Meanwhile, well wishers gathered outside to pray for his recovery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X