వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశ్రునయనాలతో మెరీనాలో అంత్యక్రియలు, ఫ్యామిలీ కన్నీరుమున్నీరు: పళనికి హైకోర్టు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియల విషయంలో హైడ్రామా నడిచింది.

Recommended Video

    మెరీనా వద్ద ఆర్మీ: ఎందుకో చెప్పాలని సీఎంకు స్టాలిన్ ప్రశ్న

    జయకు నో, కరుణ కోసం వెనక్కి: మెరినా బీచ్‌లో అంత్యక్రియలపై ఏం జరిగిందంటే?జయకు నో, కరుణ కోసం వెనక్కి: మెరినా బీచ్‌లో అంత్యక్రియలపై ఏం జరిగిందంటే?

    Newest First Oldest First
    7:06 PM, 8 Aug

    అన్నా మెమోరియల్‌కు సమీపంలో కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
    7:01 PM, 8 Aug

    కరుణానిధి అంత్యక్రియలకు వచ్చిన జనంతో మెరీనా బీచ్ కిక్కిరిసిపోయింది. స్టాలిన్, అళగిరి, కనిమొళి, సెల్వి తదితరులు కన్నీరుమున్నీరు అయ్యారు.
    6:50 PM, 8 Aug

    మెరీనా బీచ్‌లో కరుణానిధికి నివాళులు అర్పిస్తూ పలువురు కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.
    6:37 PM, 8 Aug

    తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రి జయకుమార్, కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్‌లు కరుణ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపి కనిమొళి నివాళులు అర్పించారు.
    6:30 PM, 8 Aug

    కరుణానిధి పార్థిదేహంపై జాతీయ జెండా కప్పి జవాన్లు గౌరవ వందనం సమర్పించారు. అంత్యక్రియలు జరుగుతున్న మెరీనా బీచ్ వద్దకు రాహుల్ గాంధీ వచ్చారు.
    6:19 PM, 8 Aug

    కరుణానిధి పార్థివదేహం మెరీనా బీచ్‌కు చేరుకుంది.
    6:18 PM, 8 Aug

    ఎంకే స్టాలిన్, సోదరి సెల్వి, అళగిరిలు అంతిమయాత్రలో కూర్చున్న దృశ్యం
    6:09 PM, 8 Aug

    కరుణానిధి అంత్యక్రియలకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవేగౌడ సహా ఎందరో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
    4:14 PM, 8 Aug

    చెన్నై చేరుకున్న చంద్రబాబు కరుణానిధి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. కరుణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. దేశం, తమిళనాడు అభివృద్ధికి కరుణ ఎంతో తపించేవారన్నారు.
    4:11 PM, 8 Aug

    సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా మెరీనా బీచ్ చేరుకోనుంది.
    3:48 PM, 8 Aug

    కాసేపట్లో రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు ఇస్తారు. రాజాజీ హాల్ వద్దకు మహాప్రస్థానం వాహనం చేరుకుంది.
    3:20 PM, 8 Aug

    కరుణానిధి శవపేటికపై ఆయన చెప్పిన వ్యాఖ్యలనే చెక్కారు. విరామం లేకుండా పని చేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రజలు మన సమాధిని చూసినప్పుడు అనుకోవాలని కరుణ ఒకప్పుడు తనయుడితో అన్నారు. ఇప్పుడు శవపేటికపై అదే చెక్కారు.
    3:14 PM, 8 Aug

    కరుణానిధికి నివాళులు అర్పించేందుకు వికళాంగులు కూడా తరలి వచ్చారు.
    2:47 PM, 8 Aug

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెన్నై బయలుదేరారు. ఆయన కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.
    2:44 PM, 8 Aug

    కరుణానిధి భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.
    2:44 PM, 8 Aug

    కరుణానిధి అంత్యక్రియలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
    2:26 PM, 8 Aug

    ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ.. కరుణానిధి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
    2:15 PM, 8 Aug

    కరుణానిధి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చెన్నై వచ్చారు.
    1:58 PM, 8 Aug

    అధికారంలో ఉన్న వారు ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అన్నారు. అంతిమయాత్ర సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయం అందరినీ నిరాశపరిచిందన్నారు.
    1:54 PM, 8 Aug

    డీఎంకే కార్యకర్తలకు ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, తన కోసం కాదని, కరుణానిధికి నివాళిగా ఉండాలని కోరారు.
    1:47 PM, 8 Aug

    కరుణానిధి అంత్యక్రియలకు ఏర్పాట్లు
    1:47 PM, 8 Aug

    రాజాజీ హాలులోకి వెళ్లేందుకు ప్రజలు గోడలు ఎక్కే ప్రయత్నం చేశారు. బారీకేడ్లు తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
    1:36 PM, 8 Aug

    మెరీనా బీచ్ వద్ద కేంద్రం ఆర్మీని దింపింది. సైనిక వాహనాలు క్రమంగా చేరుకుంటున్నాయి.
    1:16 PM, 8 Aug

    కరుణానిధి మృతికి సంతాపంగా పలువురు గుండు కొట్టించుకున్నారు.
    1:08 PM, 8 Aug

    వాలాజా రోడ్డు, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర సాగనుంది. అనంతరం ఆరు గంటలకు మెరీనా - అన్నా స్క్వేర్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
    12:42 PM, 8 Aug

    రాజాజీ హాలులో కరుణానిధికి నివాళులు అర్పించిన అనంతరం స్టాలిన్ తదితర నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ
    12:42 PM, 8 Aug

    కరుణానిధి మృతి దేశానికి తీరని లోటు అని మమతా బెనర్జీ అన్నారు.
    12:40 PM, 8 Aug

    మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు చోటు కల్పించకపోవడం తనను బాధించిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాను తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేశానని, కానీ అతను అందుబాటులోకి రాలేదని, ఇదే విషయమై ప్రధాని మోడీకి ఫోన్ చేశానని చెప్పారు.
    12:18 PM, 8 Aug

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరారు. ఆయన కరుణకు నివాళులు అర్పించనున్నారు. అంత్యక్రియలకు హాజరు కానున్నారు.
    12:17 PM, 8 Aug

    ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఒక యోధుడిని కోల్పోయిందన్నారు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలపై ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.
    READ MORE

    డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియల విషయంలో డీఎంకే పార్టీ, అన్నాడీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం రాజుకుంది. మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాలని డీఎంకే కోరగా, అన్నాడీఎంకే ససేమీరా అని చెప్పింది. దీనిపై డీఎంకే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

    మంగళవారం అర్ధరాత్రి జడ్జిలు విచారణ జరిపారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలలోపు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ఇతర నేతల అంత్యక్రియలకు స్థలం ఇచ్చినట్టుగానే సీనియర్‌ నేత కరుణానిధికి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. అనంతరం ఎనిమిది గంటలకు విచారణ చేపట్టనుంది.

    Karunanidhi no more, Live updates: Uncertainty Over Karunanidhi’s Burial Site Continues, DMKs Plea for Marina Beach Adjourned Till 8amall

    మాజీ ముఖ్యమంత్రులు సి రాజగోపాలాచారి, కె కామరాజ్‌ల స్మారకాల పక్కన భూమి ఇస్తామని తొలుత ప్రభుత్వం చెప్పింది. మెరీనాలో కావాలంటూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఎంకే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రమేష్, మరో ఇద్దరు న్యాయమూర్తులు విచారణ జరిపారు.

    అంతకుముందు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్.. కరుణానిధి అందించిన సుదీర్ఘ సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయన అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో అన్నాదురై సమాధి ప్రాంగణంలో చోటు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామికి లేఖ రాశారు. మద్రాస్‌ హైకోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో ఉండటం, న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ వినతిని ఆమోదించలేమని ప్రభుత్వం తెలిపింది.

    Karunanidhi no more, Live updates: Uncertainty Over Karunanidhi’s Burial Site Continues, DMKs Plea for Marina Beach Adjourned Till 8amall

    సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని రాజాజీ, కామరాజ్‌ స్మారకాల పక్కనే రెండెకరాల భూమిని ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. గతంలో ఎంజి రామచంద్రన్‌, జయలలితలకు మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిగాయి. వారి స్మారకాలనూ ఏర్పాటు చేశారు. అక్కడే అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాలని డీఎంకే కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు.

    డీఎంకే తరఫు న్యాయవాదులు.. మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ నివాసానికి వెళ్లి అత్యవసర పిటిషన్‌ దాఖలుకు అనుమతి కోరారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ ఏజీకి నోటీసు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

    English summary
    The hearing will be held Justice Ramesh's residence itself as it’s a holiday for the High Court in view of the DMK chief's death. The verdict is expected at about 8.30 a.m.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X