చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెరీనా వద్ద ఆర్మీ: ఎందుకో చెప్పాలని సీఎంకు స్టాలిన్ ప్రశ్న, అభిమానులపై లాఠీఛార్జ్, ఇద్దరు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు

చెన్నై: కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌కు నాయకులు, వీఐపీలు, అభిమానులు తరలి వస్తున్నారు. కలైంజ్ఞర్‌ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున రాజాజీ హాల్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు

కరుణానిధిని చివరిసారిగా చూసేందుకు ప్రజలు రాజాజీ హాల్‌ లోపలికి చొచ్చుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. చొచ్చుకు వస్తున్న రద్దీని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు. రాజాజీ హాల్ సమీపంలో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించి వచ్చే ప్రయత్నం చేశారు. కొందరు గోడలు ఎక్కారు. లాఠీఛార్జ్ సందర్భంగా దాదాపు నలభై మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు. కొందరిని ఆసుపత్రికి తరలించారు. రాజాజీ హాలుకు వెళ్లే మార్గాన్ని మూసేశారు.

Karunanidhi no more: Massive crowd at Rajaji Hall, several injured in stampede

మరోవైపు, మెరీనా బీచ్ వద్ద కేంద్రం ఆర్మీని దింపింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చింది. సైనిక వాహనాలు క్రమంగా చేరుకుంటున్నాయి. అన్నాదురై సమాధి వద్ద డీఎంకే కార్యకర్తలు తలనీలాలు సమర్పించారు.

సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం

ముఖ్యమంత్రి పళని స్వామి నిర్ణయం అందరినీ

అధికారంలో ఉన్న వారు ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అన్నారు. అంతిమయాత్ర సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయం అందరినీ నిరాశపరిచిందన్నారు. డీఎంకే కార్యకర్తలకు ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

అందరూ ప్రశాంతంగా ఉండాలని, తన కోసం కాదని, కరుణానిధికి నివాళిగా ఉండాలని కోరారు. అభిమానులు సంయమనం పాటించాలన్నారు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలపై హైకోర్టు తీర్పు ప్రజా విజయం అన్నారు. ప్రభుత్వం వివాదం సృష్టించాలని ప్రయత్నించిందన్నారు. భద్రత ఎందుకు తొలగించారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
The police have blocked the entry to Rajaji Hall, where Karunanidhi's mortal remains have been kept, due to massive crowd. Reports say that people are trying to scale walls to enter the hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X