వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ గాంధీ హత్య, కరుణానిధి, కాంగ్రెస్ కు ఏం సంబంధం: డీఎంకే!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి ఐదు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రెండు సార్లు కరుణానిధిని అధికారానికి దూరం చేశాయి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ, మరోసారి తెర వెనుక అదే పార్టీ కథ నడిపించి కరుణానిధిని సీఎం పదవికి దూరం చేసింది. అయితే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రావడానికి కరుణానిధి సహకరించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో కరుణానిధి, డీఎంకే పార్టీ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. ఎల్ టీటీఇ ఉగ్రవాదులతో వీరికి సంబంధాలు ఉన్నాయని అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది.

కలైంజ్ఞర్ నేతలు, సిినీ ప్రముఖుల నివాళి (పిక్చర్స్)

ఇందిరా గాంధీతో ఫైట్

ఇందిరా గాంధీతో ఫైట్

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మీద కరుణానిధి విమర్శలు చేశారు. ఆ సందర్బంలో కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి ప్రభుత్వం తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తు తమిళనాడు శాసన సభను రద్దు చేసిన ఇందిరా గాంధీ రాష్ట్రపతి పాలన విధించారు.

ఎల్ టీటీఇతో డీఎంకేకి లింక్ !

ఎల్ టీటీఇతో డీఎంకేకి లింక్ !

1990 నవంబర్ 10 తేదీ నుంచి 1991 వరకు భారత ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నారు. ఆ సమయంలో కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిషేదిత ఎల్ టీటీఇ కేంద్ర కార్యాలయంతో డీఎంకే పార్టీకి సంబంధాలు ఉన్నాయని, కరుణానిధి ప్రభుత్వం చాల ప్రమాదకరం అని ఆరోపిస్తూ కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసిన ప్రధాన మంత్రి చంద్రశేఖర్ తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయిన ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తెరవెనుక నుంచి కథ నడిపించింది.

నాలుగు నెలలకే రాజీవ్ గాంధీ హత్య

నాలుగు నెలలకే రాజీవ్ గాంధీ హత్య

తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించిన నాలుగు నెలలకే అదే రాష్ట్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్ టీటీఇ ఉగ్రవాదులు హత్య చేశారు. ఆ సందర్బంలో కరుణానిధికి చెందిన డీఎంకే పార్టీ ఉగ్రవాదులతో కలిసి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేయించిందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో కరుణానిధిని అందరూ అనుమానించారు.

ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలుఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు

పాతాళంలోకి డీఎంకే పార్టీ

పాతాళంలోకి డీఎంకే పార్టీ

రాజీవ్ గాంధీ హత్య తరువాత తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఊహించని ఎదురుదెబ్బపడింది. డీఎంకే పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. రాజీవ్ గాంధీ హత్య, ఎల్ టీటీఇతో సంబంధాలు ఉన్నాయనే రెండు విషయాలు కరుణానిధి పార్టీని పాతాళానికి తొక్కేసింది.

కాంగ్రెస్ తో దోస్తీ

కాంగ్రెస్ తో దోస్తీ

రాజీవ్ గాంధీ హత్యకు కరుణానిధికి చెందిన డీఎంకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిసిన తరువాత కాంగ్రెస్- డీఎంకే పార్టీలు దగ్గర అయ్యాయి. మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధాన మంత్రి కావడానికి కరుణానిధి పూర్తి సహకారం అందించారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గత ఏడాది చెన్నై చేరుకుని కరుణానిధి ఇంటికి వెళ్లారు. కరుణానిధికి నమస్కరించిన సోనియా గాంధీ ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇటీవల కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రాహుల్ గాంధీ సైతం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు సేకరించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి శత్రువుగా కనిపించిన కరుణానిధి తరువాత రాజీవ్ గాంథీ హత్య కేసు అపవాదు నుంచి బయటపడ్డారు.

English summary
Karunanidhi's DMK parties name also came hear in Rajiv Gandhi assassin case. In 1991 central government dismissed Karunanidhi government for keeping links with LTTE terrors. In four months of dismissed Rajiv Gandhi killed by LTTE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X