చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ విషమించిన కరుణానిధి ఆరోగ్యం: 24గంటలపాటు అబ్జర్వేషన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మళ్లీ విషమించింది. కావేరి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న కరుణ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు ఆ హాస్పటల్ వర్గాలు సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాయి.

ప్రస్తుతం క్రిటికల్ కేర్‌లో ఉన్న కరుణానిధిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. వయసు సమస్యల దృష్ట్యా.. కరుణానిధి శరీరంలోని కీలక అవయవాలను సాధారణ స్థితికి తీసుకురావడం ఇబ్బందిగా మారుతోందని డాక్టర్లు తెలిపారు.

Karunanidhis Health Worsens, Maintaining Vitals A Challenge: Hospital

రానున్న 24 గంటల్లో చికిత్సకు స్పందించిన రీతిని బట్టి తదుపరి ట్రీట్‌మెంట్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం 24గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందని వార్త విన్న పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఆస్పత్రి వద్దకు భారీగా డీఎంకే శ్రేణులు, అభిమానులు చేరుకుంటున్నారు.

English summary
The health of DMK patriarch M Karunanidhi, who is admitted in Chennai's Kauvery hospital for more than a week, has taken a turn for the worse. The hospital said maintaining his vital organ functions remains a challenge in view of his age-related ailments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X