వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రోజు టెర్రరిస్టు అజ్మల్ కసబ్.. లైబ్రరీలోకి దూరేదుంటే నిర్దోషిగా తేలేవాడు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను 'ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్'తో పోల్చి, కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసను ముంబై దాడులతో ముడిపెడుతూ.. విద్యార్థుల్ని టెర్రరిస్టులతో పోల్చుతూ ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.

వీడియోల కలకలం

వీడియోల కలకలం

జామియా వర్సిటీలో డిసెంబర్ 15న జరిగిన హింసాకాండకు సంబంధించి ఆదివారం కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నాటి ఘటనలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని, వర్సిటీ లైబ్రరీలోకి గుసాయించిమరీ విద్యార్థుల్ని చితకబాదారనే ఆరోపణలున్నాయి. అయితే పోలీసులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. లైబ్రరీలో అసలేం జరిగిందనే సంగతి వీడియోలతో వెల్లడైంది. అప్పటిదాకా బయటున్న కొందరు విద్యార్థులు.. హడావుడిగా లైబ్రరీ హాల్లోకి వెళ్లి.. పుస్తకాలు చదువుతున్నట్లు నటించడం.. అంతలోనే పోలీసులు ఎంటరై వారిని చితకబాదడం.. మరో వీడియోలో విద్యార్థులు రాళ్లు చేతబట్టుకుని ఉండటం కనిపించింది. మూడు వీడియోల్లో ఆఖరిదాంట్లో.. అదికూడా ఒకరిద్దరు స్టూడెంట్లు మాత్రమే రాళ్లు పట్టుకుని కనిపించడం గమనార్హం. దీనిపై కపిల్ మిశ్రా విద్వేషపూరిత కామెంట్లు చేశారు.

అలాగైతే కసబ్ కూడా నిర్దోషే..

అలాగైతే కసబ్ కూడా నిర్దోషే..


జామియా వర్సిటీ ప్రాంగణంలో విధ్వంసానికి పాల్పడిన తర్వాతే విద్యార్థులు లైబ్రరీలోకి వెళ్లి చదువుకుంటున్నట్లు నటించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ గొడవను 26/11 ముంబై దాడులతో ముడిపెడుతూ కపిల్ మిశ్రా.. ‘‘ఆ రోజు కసబ్ కూడా ఏ లైబ్రరీలోకో దూరి ఉంటే ఈ పాటికి నిర్దోషిగా బయటపడేవాడేమో''అని రాసుకొచ్చారు. దాడి విద్యార్థులపై జరిగితే, దాన్ని టెర్రరిస్టు దాడులతో ముడిపెట్టడమేంటని ప్రతిపక్ష పార్టీలు కపిల్ మిశ్రాపై భగ్గుమన్నాయి.

Recommended Video

India vs Pak Polls On February 8 || Oneindia Telugu
హైకమాండ్ వద్దన్న తర్వాత కూడా..

హైకమాండ్ వద్దన్న తర్వాత కూడా..

సీఏఏ నిరసనలపై బీజేపీ నేతలెవరూ అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదంటూ పార్టీ హైకమాండ్ సోమవారం ఆదేశాలు జారీచేసిన కొద్దిసేపటికే కపిల్ మిశ్రా ఈరకమైన విద్వేష కామెంట్లు చేయడం కమళదళంలో చర్చనీయాంశమైంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మిశ్రా ఆప్ అభ్యర్థి చేతిలో 11,133 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్ని పాకిస్తాన్-ఇండియా మ్యాచ్ తో పోల్చినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కపిల్ మిశ్రా తాజా ఉదంతంపై బీజేపీ అధికారికంగా స్పందించాల్సిఉంది.

English summary
In another controversial remark, BJP leader Kapil Mishra has equated the December 15 violence in Jamia Milia Islamia to the 26/11 terrorist attack in Mumbai saying that Kasab would have been called innocent had he ran into a library
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X