• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అడుగు బయట పెట్టలేని స్థితి: నో మొబైల్..నో ఇంటర్ నెట్: 144 సెక్షన్ విధింపు

|
  Jammu and Kashmir: Mobile Internet Snapped, Section 144 To Be Imposed From 6AM | Oneindia Telugu

  శ్రీనగర్: కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటోన్న జమ్మూ కాశ్మీర్ సోమవారం నాటికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శ్రీనగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పౌర జీవనంపై ఆంక్షలు విధించారు. ఇద్దరికి మించి గుమికూడదని సైన్యం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్‌ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.

  ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తిన వైఎస్ జగన్

  ఇతర రాష్ట్రాల విద్యార్థులను రాత్రికి రాత్రి వారి స్వస్థలాలకు తరలించారు. మరోవంక- ప్రభుత్వం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వారి ఇళ్లల్లో వారు బందీలు అయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగమిలను సైతం అరెస్టు చేశారు.

  నో మొబైల్.. నో ఇంటర్నెట్

  జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మొబైల్, ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై తప్పుడు సమాచారం బాహ్య ప్రపంచానికి వ్యాపింపజేస్తారనే ఉద్దేశంతో ఇంటర్ నెట్, మొబైల్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. శాటిలైట్ ఫోన్లు, అధికారిక కమ్యూనికేషన్లు మాత్రమే ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్నాయి. జిల్లా పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. చాలా ప్రాంతాల్లో పెట్రోలు బంకులను మూసివేశారు. మీడియా ప్రతినిధుల కోసం బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. కళ్లు తిరిగే ధరలను నిర్ధారించింది. ఒక న్యూస్ ఐటమ్ ను బదిలీ చేయడానికి లక్ష రూపాయల ఛార్జీని వసూలు చేస్తామని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.

  Kashmir: Curfew-like restrictions imposed on movement of people

  అమిత్‌ షా-దోవల్‌ కీలక భేటీ..

  Kashmir: Curfew-like restrictions imposed on movement of people

  జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5-7 మంది పాక్‌ బ్యాట్‌ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్‌నాథ్‌ యాత్రికులు రిజర్వేషన్‌ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయరాదని కార్గిల్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  National Conference chief Omar Abdullah and PDP chief Mehbooba Mufti have been put under house arrest as the authorities imposed restrictions on the people's movements across Srinagar. Mobile and internet services have also been suspended in the Valley. "Former CMs Omar Abdullah, Mehbooba Mufti not to be allowed to move out of house as strict curfew to be imposed at crack of dawn, " the police said. "I believe I’m being placed under house arrest from midnight tonight," former Jammu and Kashmir chief minister said in a tweet.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more