• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్‌ ఇష్యూలో పాకిస్థాన్‌కు రష్యా ఝలక్.. అదే తోవలో చైనా కూడా..!

|

ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్‌ విభజన నిర్ణయంపై భారత ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆ క్రమంలో దాయాది పాకిస్థాన్‌ కుట్రలకు బ్రేకులు పడుతున్నాయి. కశ్మీర్ విషయంలో మరోసారి ఆ దేశానికి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రష్యా ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో దాయాది దేశానికి గట్టి షాక్ కొట్టినట్లైంది. కశ్మీర్ వ్యవహారం అంతర్గత వ్యవహారమని కూడా సెలవిచ్చింది. అటు మద్దతు కోసం చైనాను ఆశ్రయించిన పాకిస్థాన్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది.

కశ్మీర్ విషయంలో పాక్ దుర్బుద్ధి.. గట్టిగా షాక్ తగులుతోందిగా..!

కశ్మీర్ విషయంలో పాక్ దుర్బుద్ధి.. గట్టిగా షాక్ తగులుతోందిగా..!

కశ్మీర్‌ విభజన వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ప్రపంచస్థాయిలో ఇండియాను తప్పుపట్టాలని చూస్తున్న దాయాది పాకిస్థాన్ కుట్రలు సాగడం లేదు. ఆ క్రమంలో పాకిస్థాన్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. కశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ మధ్యవర్తిత్వం కోసం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది పాకిస్థాన్. ఆ క్రమంలో పాకిస్థాన్ పాచికలు పారలేదు.

అంతేకాదు పాక్ అభ్యర్థనను ఐక్యరాజ సమితి తోసిపుచ్చడం గమనార్హం. అదలావుంటే భారతదేశం నిర్ణయాన్ని సమర్థిస్తూ రష్యా నిర్ణయం తీసుకోవడంపై ఆ దేశానికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అంతేకాదు ఒకవేళ కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాక్‌ ప్రస్తావించినా.. ఇండియాకు రష్యా మద్దతు లభిస్తుందనేది స్పష్టమవుతోంది.

ఈ బుడ్డోడి డ్యాన్స్ మ్యాజిక్కు.. ఇంతకు ఏ మ్యూజిక్కో తెలుసా (వీడియో)

ఇండియాకు అనుకూలంగా రష్యా.. పాక్ మద్దతుకు నో..!

ఇండియాకు అనుకూలంగా రష్యా.. పాక్ మద్దతుకు నో..!

జమ్ముకశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దుపై భారత్‌కు అనుకూలంగా మాట్లాడింది రష్యా. జమ్ముకశ్మీర్‌ హోదా మార్పు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది భారత రాజ్యాంగ విధివిధానాలకు లోబడే జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే కశ్మీర్ విభజన విషయంలో భారత్ తీసుకున్న అనూహ్యమైన నిర్ణయంతో ఇండియా - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రెండు దేశాలు కూడా సంయమనం పాటిస్తాయనే నమ్మకముందని వెల్లడించింది.

ఇదే సందర్భంలో 1972 నాటి సిమ్లా ఒప్పందం ప్రస్తావించింది రష్యా. దాని ప్రకారం, అందులో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రాజకీయ, దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చల ద్వారానే రెండు దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయని రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది.

పాకిస్థాన్ కుట్రలకు బ్రేకులు..!

పాకిస్థాన్ కుట్రలకు బ్రేకులు..!

ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో ఇండియాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాలని భావిస్తున్న పాకిస్థాన్ కుట్రలకు బ్రేకులు పడుతున్నాయి. పాకిస్థాన్‌కు శాశ్వత మిత్రపక్ష దేశమైన చైనా కూడా కశ్మీర్ విభజన విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కశ్మీర్ విషయంలో తాము చేయబోయే పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ చైనాను కోరింది పాకిస్థాన్. అయితే దాయాది దేశం ఆశించినంత రెస్పాన్స్ రాలేదు.

చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. ఎలుగుబంటి పాలన.. వైసీపీ నేతల సెటైర్లు..!

రెండు మిత్రదేశాలే.. మేమెట్లా మధ్యలో..!

రెండు మిత్రదేశాలే.. మేమెట్లా మధ్యలో..!

జమ్ముకశ్మీర్‌ విభజన నేపథ్యంలో మద్దతు కోరుతూ పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ హుటాహుటిన చైనా వెళ్లి.. అక్కడి విదేశాంగ మంత్రి వాంగ్ యి తో భేటీ అయ్యారు. అయితే సపోర్ట్ కావాలంటూ ఆయన కోరిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది చైనా. ఇండియా, పాకిస్థాన్ రెండు కూడా తమకు మిత్రదేశాలని స్పష్టం చేసింది. సిమ్లా ఒప్పందం, ఐరాస తీర్మానం ఆధారంగా.. కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించడం కొసమెరుపు.

English summary
Russia has backed India's move on Jammu and Kashmir, saying that the changes in the status are within the framework of the Indian Constitution and hoped that the differences between India and Pakistan are resolved bilaterally on the basis of the Simla Agreement and the Lahore Declaration. Russia Given Big Shock to Pakistan and as well as China also deny to support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X