వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లబ్ క్రికెట్ టీం కలకలం: పాక్ జెర్సీ వేసుకుని, ఆ దేశ జాతీయగీతం పాడారు!

జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులు, పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రభావంతో కొంతమంది కాశ్మీర్ యువత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, కాశ్మీర్‌లో ఓ క్ల‌బ్ క్రికెట్ టీమ్ ప్లేయ‌ర్స్ పాకిస

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులు, పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రభావంతో కొంతమంది కాశ్మీర్ యువత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, కాశ్మీర్‌లో ఓ క్ల‌బ్ క్రికెట్ టీమ్ ప్లేయ‌ర్స్ పాకిస్థాన్ జెర్సీలు వేసుకుంది. అంతటితో ఆగకుండా, మ్యాచ్‌కు ముందు పాక్ జాతీయ గీతాన్ని కూడా పాడ‌టంతో కలకలం రేపింది.

కాగా, ఇప్పుడీ వీడియో నెట్‌లో వైర‌ల్ అవుతోంది. శ్రీన‌గ‌ర్‌కు స‌మీపంలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు, జరిగిన సంఘటనపై విచార‌ణ జ‌రుపుతున్నారు. వాళ్ల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌ట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై విచార‌ణ వేగ‌వంతం చేస్తామ‌ని గండెర్బ‌ల్ ఎస్ఎస్‌పీ ఫ‌యాజ్ లోన్ వెల్ల‌డించారు. రెండు క్ల‌బ్ టీమ్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అయితే ఈ మ్యాచ్ ఏ గ్రౌండ్‌లో జ‌రిగిందో ఇంకా తెలియ‌డం లేదన్నారు.

వేర్పాటువాదులు బంద్ ప్ర‌క‌టించిన రోజే.. సెంట్ర‌ల్ కాశ్మీర్‌లోని ఓ గ్రౌండ్‌లో మ్యాచ్ జ‌రిగిన‌ట్లు పోలీస్ వ‌ర్గాలు తెలిపాయి. ఆ ప్లేయ‌ర్స్ పాక్ జెర్సీలు వేసుకొని, నిర్వాహ‌కులు పాక్ జాతీయ గీతాన్ని ప్లే చేస్తుంటే గొంతు క‌లిపారు.

గౌర‌వ సూచ‌కంగా పాక్ జాతీయ గీతాన్ని ఆల‌పించ‌నున్న‌ట్లు అంత‌కుముందు కామెంటేట‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. కాగా, పాకిస్థాన్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కాశ్మీర్ యువతను తప్పుదారిన తీసుకెళ్తోందని, అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు ప్రోత్సహిస్తోందని ఇటీవల భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

English summary
A video showing a local cricket team from Pakistan sporting the Pakistan national cricket team's jersey and singing the national anthem has surfaced. In the video the team is also heard singing the national anthem of Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X