• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పూర్తయిన ఘట్టం: జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

|

జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు బిల్లు పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 367 మంది సభ్యులు ఓటువేయగా.. వ్యతిరేకంగా 67 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు పాస్ అయినట్లుగా స్పీకర్ ఓంబిర్లా డిక్లేర్ చేశారు. అంతేకాదు జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతిపాదించిన తీర్మానంకు కూడా సభ ఆమోదం పొందింది. మరోవైపు రిజర్వేషన్లపై కూడా లోక్‌సభ ఆమోదం తెలిపింది.

సోమవారం రోజున జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అక్కడ 125 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఆమోదం తెలపగా.. 61 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.

Kashmir turmoil LIVE:Discussion on J&k reorganisation bill to be taken up in loksabha

Newest First Oldest First
7:41 PM, 6 Aug
లోక్‌సభ నిరవధిక వాయిదా
7:38 PM, 6 Aug
అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్
7:37 PM, 6 Aug
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌లోని రిజర్వేషన్ బిల్లు కూడా రద్దవుతుందని సభకు తెలిపిన అమిత్ షా. ఇక ఇతర రాష్ట్రాలకు వర్తించే రిజర్వేషన్లే జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తాయని స్పష్టం చేసిన అమిత్ షా
7:37 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్ లో రిజర్వేషన్ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు సభకు తెలిపిన అమిత్ షా
7:36 PM, 6 Aug
రాష్ట్రపతి ఆమోదం కోసం జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును పంపనున్న ప్రభుత్వం
7:04 PM, 6 Aug
పునర్విభజన బిల్లుకు అనుకూలంగా 367 ఓట్లు, వ్యతిరేకంగా 67 ఓట్లు
7:03 PM, 6 Aug
జమ్మూకశ్మీర్ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
7:01 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
7:00 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్ కర్ఫ్యూ: 400 మంది రాజకీయనాయకులను, వేర్పాటు వాదులను అరెస్టు చేసిన పోలీసులు
6:58 PM, 6 Aug
బిల్లును పాస్ చేసే క్రమంలో రాజ్యాంగ పద్దతిని పాటించి ఉంటే బాగుండేది: జ్యోతిరాదిత్య సింధియా
6:58 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లును తాను సమర్థిస్తున్నట్లు చెప్పిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా
6:55 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్‌ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని చిరకాలం గుర్తుంచుకుంటారు: అమిత్ షా
6:46 PM, 6 Aug
జమ్మూకశ్మీర్ ప్రజలను ఇంకా పేదరికంలోనే ఉంచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి:అమిత్ షా
6:44 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్‌ను ఐక్యరాజ్యసమితి దగ్గరకు ఎవరు తీసుకెళ్లారు: అమిత్ షా
6:43 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం ఇస్తున్న నిధులు ఏమవుతున్నాయో ఎవరికీ తెలియదు.. అక్కడి గ్రామాల్లో మార్పు మాత్రం కనిపించలేదు: అమిత్ షా
6:42 PM, 6 Aug
దేశమంత వివాహ వయస్సు ఒకలా ఉంటే జమ్మూ కశ్మీర్‌లో మాత్రం మరోలా ఉంది: అమిత్ షా
6:42 PM, 6 Aug
జమ్మూ కశ్మీర్‌లో బాల్యవివాహాలు చాలా జరుగుతున్నాయి: అమిత్ షా
6:41 PM, 6 Aug
పీఓకేపై వెనక్కు తగ్గం..ఎలా తెచ్చుకోవాలో మాకు బాగా తెలుసు: అమిత్ షా
6:41 PM, 6 Aug
రానున్న ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం..అది మీరే చూస్తారు: అమిత్ షా
6:38 PM, 6 Aug
రెండు ఆర్టికల్‌ తీసుకొచ్చి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు: అమిత్ షా
6:35 PM, 6 Aug
ఆర్టికల్ 371ను ఎత్తివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: అమిత్ షా
6:28 PM, 6 Aug
ఆర్టికల్ 370 రద్దు తర్వాత 106 కేంద్ర చట్టాలు జమ్మూ కశ్మీర్‌లో అమలవుతాయి: రవిశంకర్ ప్రసాద్
6:27 PM, 6 Aug
హురియత్ నేతలతో చర్చలు ఎందుకు జరపాలి..వారు పాక్ నుంచి ప్రేరణ పొందిన వారు: అమిత్ షా
6:26 PM, 6 Aug
ఈ నాటి పరిస్థితికి జవహర్‌లాల్ నెహ్రూనే కారణం
6:26 PM, 6 Aug
మైనార్టీలకు ఆర్టికల్ 370తో అన్యాయం జరిగింది: అమిత్ షా
6:22 PM, 6 Aug
జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్రంగా చేస్తాం: అమిత్ షా
6:22 PM, 6 Aug
ఆనాడు ఏపీ విషయంలో కాంగ్రెస్ చేసింది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు:అమిత్ షా
6:21 PM, 6 Aug
ఏపీ విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా సభ ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్: అమిత్ షా
6:20 PM, 6 Aug
ఆర్టికల్ 370కి ఆర్టికల్ 371కి మధ్య చాలా తేడా ఉందని చెప్పిన అమిత్ షా
6:19 PM, 6 Aug
ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారమే మేము ముందుకు వెళుతున్నాం: అమిత్ షా
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Narendra Modi government revoked Article 370 which gave special status to Jammu and Kashmir. Rajya Sabha approved the resolution abrogating Article 370 for J&K and a bill to bifurcate the state into two union territories, Jammu and Kashmir and Ladakh. The discussion on the bill will be taken up on August 6th in the Lower house
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more