• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్‌లో అలజడి.. ఆర్మీ వాహనం అనుకుని ట్రక్కుపై దాడి..!

|

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఆర్మీ వాహనంగా భావించి ప్రైవేట్ ట్రక్కుపై నిరసనకారులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు దరిమిలా సాయుధ బలగాల నిఘా ఇంకా కొనసాగుతోంది. అల్లరి మూకలు రెచ్చిపోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. అదలావుంటే ఆర్మీ వాహనంగా భావించి ఓ ప్రైవేట్ ట్రక్కుపై కొందరు నిరసనకారులు దాడి చేయడంతో డ్రైవర్ చనిపోయిన ఘటన హాట్ టాపికైంది. ఆ క్రమంలో స్థానిక పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు.

ఒక్కసారిగా అలజడి.. ఆర్మీ వాహనం అనుకుని..!

ఒక్కసారిగా అలజడి.. ఆర్మీ వాహనం అనుకుని..!

ఆర్టికల్ 370 రద్దు దరిమిలా జమ్ముకశ్మీర్‌లో సాయుధ బలగాల నిఘా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి సైనిక దళాలు. అయినా కూడా అడపాదడపా అల్లరి మూకలు చెలరేగిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. నిరసనకారులకు ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పటికే కమ్యూనికేషన్‌తో పాటు తదితర సేవల్ని నియంత్రించిన కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.

అయితే ఆదివారం నాడు సాయంత్రం జరిగిన ఘటన ఒక్కసారిగా అలజడి రేపింది. సైనిక వాహనంగా భావించిన దుండగులు కొందరు ప్రైవేట్ ట్రక్కుపై దాడికి దిగారు. రాళ్లు రువ్వడంతో ఆ ట్రక్కు నడుపుతున్న డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయారు.

ప్రైవేట్ ట్రక్కుపై దాడి.. డ్రైవర్ మృతి.. ఈ నెలలో రెండోసారి..!

ప్రైవేట్ ట్రక్కుపై దాడి.. డ్రైవర్ మృతి.. ఈ నెలలో రెండోసారి..!

అనంత్ నాగ్ జిల్లా జ్రాదిపొర ఉరంహాల్‌ బిజ్‌బేరాకు చెందిన 42 సంవత్సరాల నూర్ మహ్మద్ JK 03 F 2540 నెంబర్ గల ట్రక్కులో వెళుతున్న సమయంలో అల్లరి మూక దాడికి తెగబడింది. అయితే అది సైనిక వాహనం అనుకుని దాడి చేసినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్ధారించారు. ఇదే నెలలో నిరసనకారుల దాడిలో 11 ఏళ్ల బాలిక ప్రాణాలు విడిచిన ఘటన మరిచిపోకముందే మరో సంఘటన జరగడంతో సైనికులు మరింత అలర్ట్ అవుతున్నారు.

నిరసనకారుడు అరెస్ట్.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా..!

నిరసనకారుడు అరెస్ట్.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా..!

ఆదివారం (25.08.2019) నాడు సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్మీ వాహనం అనుకుని ఇలా ప్రైవేట్ ట్రక్కుపై నిరసనకారులు దాడి చేయడం చర్చానీయాంశంగా మారింది.

అల్లర్లు చెలరేగకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా ఇప్పటికే కశ్మీర్‌లో సైనిక బలగాలు మోహరించాయి. ఆ మేరకు కేంద్ర హోం శాఖ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండటం చర్చకు దారి తీసింది. ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లో పరిస్థితి కుదుట పడుతోందని.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పుకొస్తోంది హోం శాఖ. అయితే కశ్మీర్‌లో తరచుగా ఇలాంటి ఘటనలు బయటపడుతున్న నేపథ్యంలో ఆందోళన వాతావరణం కనిపిస్తోంది.

English summary
A truck driver died after being hit by stones during stone-pelting in Bhijbhera in Kashmir on Sunday evening. The deceased has been identified as Noor Mohammad, a resident of Zradipora Urnhall Bhijbhera. The accused stone pelter has been identified and arrested. The Jammu and Kashmir Police said the stone pelters pelted stones on his vehicle mistaking it as security forces vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X