వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మెచ్చిన.. కుర్రాడు! ఏం చేశాడో తెలుసా?

‘‘నీ గురించి మన ప్రధానమంత్రి మోడీ రేడియోలో చెబుతున్నారు.. ’’ అంటూ కశ్మీర్‌లోని మిలటరీ మేజర్‌ ఒకాయన నుంచి ఫోన్‌ వచ్చింది బిలాల్‌కి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

''నీ గురించి మన ప్రధానమంత్రి మోడీ రేడియోలో చెబుతున్నారు.. '' అంటూ కశ్మీర్‌లోని మిలటరీ మేజర్‌ ఒకాయన నుంచి ఫోన్‌ వచ్చింది బిలాల్‌కి. సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లిన బిలాల్ వెంటనే ఆటో ఎక్కి ఇంటికెళ్లి రేడియో ఆన్‌ చేశాడు.

''బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే ఏ యాక్టరో, క్రీడా ప్రముఖులో మనకు గుర్తొస్తారు. కానీ బిలాల్‌ అందుకు మినహాయింపు. అతడేం సెలబ్రిటీ కాదు. ఓ 18 ఏళ్ల కుర్రాడు! స్వచ్ఛత పరిరక్షణకు నడుం బిగించి.. ఆరేళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. స్వచ్ఛతా సేవలో మనందరికీ అతను ఆదర్శం..'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'మన్‌ కీ బాత్‌'లో తన గురించే ప్రస్తావించడం విని బిలాల్‌ ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయాడు.

అదే అతడి జీవితంలో పెద్ద కుదుపు...

అదే అతడి జీవితంలో పెద్ద కుదుపు...

బిలాల్‌ దర్‌.... ఉత్తర కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా లహర్‌వాల్‌పురా గ్రామానికి చెందిన కుర్రాడు. అతనికి ఇద్దరు అక్కలు. తండ్రి ప్లాస్టిక్‌ సామాన్లు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. బిలాల్‌కు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు చదువు సజావుగానే సాగింది. హఠాత్తుగా తండ్రి క్యాన్సర్‌ వ్యాధితో మరణించడం అతని జీవితంలో పెద్ద కుదుపు. చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, తల్లి, ఇద్దరు అక్కలను పోషించే భారం కూడా అతనిపైనే పడింది.

పని దొరికిన ప్రతిచోటా...

పని దొరికిన ప్రతిచోటా...

ఇక తాను చెమటోడ్చాలన్న సంగతి అర్థమైంది బిలాల్ కి. ఉపాధి కోసం శ్రీనగర్‌ బాట పట్టాడు. టీ షాపులు, రెస్టారెంట్లు, మెకానిక్‌ షెడ్లు ఇలా పని దొరికిన ప్రతిచోటా పని చేశాడు. ఆ తర్వాత ఓ హోటల్లో పనికి కుదిరాడు. ఇలా సాగిపోతున్న జీవితంలో మళ్లీ మరో కుదుపు. ఓ రోజున ఆ హోటల్‌కి పోలీసులు వచ్చారు. అక్కడ చిన్న చిన్న పనులు చేస్తున్న బిలాల్‌ను చూసి విషయం ఆరా తీశారు. ఇంత చిన్న వయసులో కూలి పనులు చేయకూడదనీ, అది చట్టరీత్యా నేరమని చెప్పారు. తన కుటుంబ నేపథ్యం గురించి, పనిచేయడం తనకెంత అవసరమో వారికి బిలాల్ వివరించినా, లాభం లేకపోయింది. ఇక శ్రీనగర్‌లో పని దొరకదని అర్థమవడంతో అతను ఇంటి ముఖం పట్టాడు.

చెత్త నుంచి ఉపాధి...

చెత్త నుంచి ఉపాధి...

తన స్నేహితులతో కలిసి బిలాల్‌ ఓ రోజు శ్రీనగర్‌లోని ఉలార్‌ సరస్సులో ఈత కొడుతున్నాడు. అయితే ఆ సరస్సులో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కవర్లు, సంచులు కనిపించాయి. అప్పుడే అతని బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది. వెంటనే దాని ఆచరణకు శ్రీకారం చుట్టాడు. రోజూ ఉదయాన్నే తన గ్రామం నుంచి శ్రీనగర్‌ బయలుదేరి సరస్సులో ఉండే చెత్తను క్లీన్‌ చేసేవాడు. ఆ చెత్తలో వచ్చిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను అమ్ముకునేవాడు. రోజుకు పన్నెండు గంటల పాటు ఆ సరస్సు దగ్గరే పని చేసి, చీకటి పడ్డాక ఇంటికి చేరుకునే వాడు. ఇదే అతని రోజూ వారీ దినచర్య. ఇలా బిలాల్‌ రోజుకి 150 నుంచి 200 వరకూ సంపాదించడం మొదలుపెట్టాడు. ఆ సంపాదనతోనే ఒక అక్క పెళ్లి కూడా జరిపించాడు.

ఆ డాక్యుమెంటరీ అతడి జీవితాన్నే మార్చేసింది..

ఆ డాక్యుమెంటరీ అతడి జీవితాన్నే మార్చేసింది..

ఉలార్‌ సరస్సు పరిశుభ్రతను తన బాధ్యతగా స్వీకరించిన బిలాల్‌ జీవితాన్ని జలాల్‌ జిలానీ అనే ఫిలింమేకర్‌ ‘సేవింగ్‌ ద సేవియర్‌' అనే డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి తెచ్చాడు. దీంతో అప్పటివరకూ ఎవరికీ తెలియని బిలాల్‌ ఒక్కసారిగా ప్రజాదరణ పొందాడు. స్థానికంగా మంచి పేరు వచ్చింది. ప్రధాని మోడీ దృష్టిలో పడడంతో ఆ తరువాత కొన్ని నెలలకే అతన్ని శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ‘స్వచ్ఛత- పరిశుభ్రత' కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఉలార్‌ నుంచి ఏడాదికి కనీసం 12 వేల కేజీల చెత్తను అతను తొలగించాడని అక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల అంచనా. బ్రాండ్‌ అంబాసిడర్‌గా బిలాల్‌ ఇప్పుడు స్థానికులకు స్వచ్ఛతా కార్యక్రమాల మీద అవగాహన కల్పించాలి. దీని కోసం అతనికి ప్రత్యేకంగా యూనిఫామ్‌ ఇవ్వడంతో పాటు వాహన వసతి కూడా కల్పించారు! ఇదీ బిలాల్ దర్ కథ!

English summary
PM Narendra Modi on Sunday addressed the nation through the 36th edition of ‘Mann Ki Baat’ radio programme. During an hour-long programme, PM Modi spoke on the various topics including people to share their views on the Narendra Modi App and My Gov Open Forum. One of the main highlights of the show was his pitch to boost cleanliness drive across the nation. PM Modi while talking about Swachh campaign gave the example of 18-year-old ragpicker Bilal Dar from Kashmir and congratulated him. Interestingly, Bilal thanked PM Modi for acknowledging him, reported ANI. Bilal has been the made the brand ambassador for cleanliness by Srinagar municipal corporation, PM Modi said during his speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X