వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి కంటతడి: ఉగ్రవాదాన్ని వదిలేసిన ఫుట్‌బాలర్ మజీద్ ఖాన్

ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో చేరిన 20ఏళ్ల జమ్మూకాశ్మీర్‌ ఫుట్‌బాల్‌(గోల్ కీపర్) ఆటగాడు మజీద్‌ ఖాన్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో చేరిన 20ఏళ్ల జమ్మూకాశ్మీర్‌ ఫుట్‌బాల్‌(గోల్ కీపర్) ఆటగాడు మజీద్‌ ఖాన్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అనంత్‌నాగ్‌కు చెందిన మజీద్‌ ఇటీవల తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఎల్‌ఈటీలో చేరినట్లు సామాజిక మాధ్యమాల్లో అతడి ఫొటోలు వైరల్‌గా మారాయి.

జమ్మూకాశ్మీర్‌ భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అతడి స్నేహితుడు యశ్వర్‌ నిసర్‌ ప్రాణాలు కోల్పోవడంతో మజీద్‌ ఉగ్రవాదంవైపు మళ్లాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి మిలిటెంట్లలో కలిశాడు.

Kashmiri Footballer Majid Khan surrenders before Army

ఒక్కగానొక్క కుమారుడు కుటుంబాన్ని వదిలి ఉగ్రవాదంలో చేరడంతో అతడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు మజీద్‌ను వెనక్కి తిరిగి వచ్చేయాల్సిందిగా కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

అంతేగాక, కాశ్మీర్‌ అంతటా పోస్టర్లు అతికించారు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి మజీద్‌ దక్షిణకాశ్మీర్‌లోని భద్రతా సిబ్బంది క్యాంప్‌కు వెళ్లి లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. అతను తన దగ్గర ఉన్న ఓ ఆయుధాన్ని కూడా పోలీసులకు అందజేశాడు.

English summary
As a result of an intense campaign, Majid Khan, 20-year-old Kashmiri footballer-turned-Lashkar-e-Taiba terrorist, surrendered with a weapon before the Army on Friday. He surrendered before 1RR of Army on Thursday around 10:30 pm. He was later handed over to Victor Force, based in Awantipora.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X