వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీరీలను మాత్రం జంతువుల్లా బోనుల్లో నిర్భంధించారు...ముఫ్తి కూతురు లేఖ

|
Google Oneindia TeluguNews

దేశం మొత్తం స్వాంతంత్ర్య దినోత్సవాలు నిర్వహిస్తుంటే కశ్మీర్ ప్రజలు బోనుల్లో ఉండే జంతువుల్లాగా నిర్భంధంలో ఉంచారని కశ్మీర్ మాజీ సీఎం మహబుబా ముఫ్తి కూతురు సనా ఇల్తిజా జావెద్ కేంద్రానికి లేఖ రాసింది. నిర్భంధం ద్వార కనీసం మానవ హక్కులు లేకుండా కొనసాగుతుందని లేఖలో పేర్కోన్నారు. కనీసం విజిటర్స్‌ను కూడ కనీసం కలవనీయ కుండా కనీసం గడప కూడ దాటనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మిడియాపై అంక్షలు ఉండడంతో వాయిస్ కాల్ ద్వార మిడీయాకు లేఖను విడుదల చేసినట్టు తెలిపారు.

కశ్మీర్ మాజీ సీఎం మహబుబా ముఫ్తితో పాటు ఇతర నేతలను నిర్భంధంలో కొనసాగుతుండంతో ఆమే తన కూతురును రంగంలోకి దింపింది. కశ్మీర్‌లో ఎలాంటీ అవాంచానీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్ నేతలను స్థానిక పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. ఈ నేపథ్యంలోనే మహాబుబా ముఫ్తి కూతురుతో కేంద్రానికి లేఖ రాయించింది. ఈనేపధ్యంలోనే కశ్మీర్‌లో జరుగుతున్న నిర్బంధంపై పలు అంశాలను లేవనెత్తింది. పార్టీలకు సంభంధం లేకున్న చాలమంది నేతలను నిర్భంధంలో పెట్టారని ఆమే ఆరోపణలు చేశారు.

Kashmiris caged like animals Mehbooba Mufti’s daughter said

ఈ నేపథ్యంలోనే తననోక క్రిమినల్‌గా ట్రీట్ చేస్తున్నారని, ప్రతి క్షణం పోలీసుల పర్యవేక్షణ తమపై పర్యవేక్షణ కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ చర్యలతో కశ్మీరీలతో పాటు తనకు కూడ ప్రాణహాని ఉందని తెలిపారు.కాగ ఏపార్టీకి సంబంధం లేని తనను ఎందుకు నిర్భంధంలో ఉంచారో తెలిపాలని ఆమే డిమాండ్ చేశారు. ఇక మరోవైపు కశ్మీర్‌లో రోజురోజుకు పరిస్థితులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతుంది. కర్ఫ్యూను సడలించడంతోపాటు,విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయను పూర్తిగా రీ ఓపెన్ చేస్తోంది.

English summary
In a strongly-worded letter to Home Minister Amit Shah, daughter of former chief minister Mehbooba Mufti said, “Kashmiris have been caged like animals and deprived of basic human rights.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X