వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథువా రేప్: మహిళలంటే అంత చులకనా?, ఆ లాయర్ అభ్యంతరకర కామెంట్స్

|
Google Oneindia TeluguNews

కశ్మీర్: కథువా హత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణానికి దేశమంతా చలించిపోయింది. ఎక్కడికక్కడ ప్రజలంతా స్వచ్చందంగా బాధితురాలికి న్యాయం చేయాలంటూ రోడ్ల పైకి వస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో నిందితుల తరుపున వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ అంకుర్ శర్మ.. మహిళలను తక్కువ చేసేవిధంగా కామెంట్స్ చేసి తన పురుషాధిక్యతను బయటపెట్టుకోవడం గమనార్హం.

ఆమెకేం తెలివి ఉంటుంది?

ఆమెకేం తెలివి ఉంటుంది?

కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. ఇప్పటికైతే సిట్(స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్) దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణ అధికారిణి శ్వేతాంబరిపై చులకన వ్యాఖ్యలు చేశారు అంకుర్ శర్మ. 'ఆమె ఓ మహిళా.. అందునా కొత్తగా చేరిన అధికారిణి.. ఆమెకు అంత తెలివి ఏముంటుంది?.' అంటూ ఒకరకంగా వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. పైగా ఆమెను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు.

కథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలుకథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలు

 ఖండించిన శ్వేతాంబరి:

ఖండించిన శ్వేతాంబరి:

అంకుర్ శర్మ వ్యాఖ్యలపై స్పందించిన శ్వేతాంబరి తననెవరూ తప్పుదోవ పట్టించడం లేదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు తనను బాధించేవిగా ఉన్నాయని, మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదని అన్నారు. అతను అవమానించింది ఓ తల్లిని, ఓ చెల్లిని అని అన్నారు. తన సీనియర్లకు తనపై విశ్వాసం ఉండబట్టే.. ఈ బాధ్యతను తనపై పెట్టారని గుర్తుచేశారు. తాను కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా.. విచారణ కొనసాగుతూనే ఉంటుందన్నారు.

 హింసించి బలవంతంగా..:

హింసించి బలవంతంగా..:

క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతున్న తీరుపై కూడా అంకుర్ శర్మ పలు సందేహాలు లేవనెత్తారు. అంతేకాదు, నిందితులను చిత్రహింసలు పెట్టి వారితో బలవంతంగా నేరాన్ని ఒప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. నిందితుల్లో ఒకరైన విశాల్ జంగోత్ర ముగ్గురు స్నేహితులను 10-15రోజులు వరుసగా చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా నేరాన్ని ఒప్పించారని ఆరోపించారు.

మెజిస్ట్రేట్ ముందు నిజం చెప్పారు?:

మెజిస్ట్రేట్ ముందు నిజం చెప్పారు?:

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేసినప్పటికీ.. సెక్షన్ 164ఏ కింద మెజిస్ట్రేట్ ముందు వారు వాంగ్మూలం ఇచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడించారని అన్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని ఎన్ని చిత్రహింసలు పెట్టింది వెల్లడించారని అన్నారు.

కాగా, జమ్ముకశ్మీర్ పోలీసుల చార్జిషీటు ప్రకారం.. ఏప్రిల్ 9న మొత్తం ఆరుగురు
వ్యక్తులు 8ఏళ్ల ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కిడ్నాప్, రేప్, హత్య అన్ని పథకం ప్రకారమే చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.

English summary
The defence lawyer of the Kathua rape and murder case has hit out at the only female member of the Special Investigation Team (SIT) of the Jammu and Kashmir police probing the case, with seemingly sexist remarks and reportedly questioning her “intelligence” as a woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X