మరో మహిళతో గోవాకు భర్త.. ఇంట్లో భార్యపై మామ అత్యాచారం..
భర్త మరో మహిళతో గోవా షికారుకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై మామ అత్యాచారానికి ఒడిగట్టాడు.
భోపాల్: భర్త మరో మహిళతో గోవా షికారుకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై మామ అత్యాచారానికి ఒడిగట్టాడు. మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలు మధ్యప్రదేశ్ మహిళా కమిషన్(ఎంపీఎస్‌డబ్ల్యూసీ)ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీనిపై స్పందించి కమిషన్ విచారణకు ఆదేశించింది. వారంలోగా నివేదిక అందజేయాలని కట్నీ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

కాగా, తన మామ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ప్రతిఘటించే ప్రయత్నం చేసినందుకు తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. విషయం భర్తతో చెప్తే.. మామ చెప్పినట్లుగా నడుచుకోవాలని ఆయనకే వత్తాసు పలికాడని వాపోయింది.
దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో బాధితురాలు తన అత్తకు ఈ విషయం చెప్పింది. ఆమె సహకారంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. తనను వేధించడమే కాక.. ఇక్కడ సంతోషంగానే ఉంటున్నాననే నమ్మకం కల్పించేలా తల్లిదండ్రులతో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చినట్లుగా పేర్కొంది.
భర్త తీవ్ర ఒత్తిడి మేరకు తన మామ గురించి తల్లిదండ్రులకు గొప్పగా చెప్పానని బాధితురాలు చెప్పుకొచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications