• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Katrina Kaif -Vicky Kaushal wedding: సల్మాన్‌కు నో ఎంట్రీ - ఆ రిపోర్ట్ తప్పనిసరి- ఏం జరుగుతోంది..?

|
Google Oneindia TeluguNews

మరో రెండు రోజుల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి గ్రాండ్‌గా జరగబోతోంది. 2019 నుంచి నటుడు విక్కీ కౌశల్ కత్రినా కైఫ్‌లు ప్రేమలో ఉన్నారు. డిసెంబర్ 9వ తేదీన ఈ ఇద్దరూ ఒక్కటి కానున్నారు. వీరిద్దరి వివాహానికి వేదికగా నిలిచింది రాజస్థాన్‌లోని పురాతన కోట. వివాహ వేడుకలకోసం ఇప్పటికే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌లు ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఇక ముంబైలోని తన ఇంటి నుంచి కత్రినా కైఫ్ ఎప్పుడెప్పుడు బయటకు అడుగుపెడుతుందా అంటూ మీడియా ఇంటి ముందే కాపుకాసింది. అయితే అక్కడ కెమెరాల కంటికి చిక్కని కత్రినా-విక్కీ కౌశల్‌లు రాజస్థాన్‌ కలినా విమానాశ్రయానికి చేరుకోగానే కెమెరాలు క్లిక్‌మనిపించాయి.

ముంబై నుంచి రాజస్థాన్‌కు కత్రినా-విక్కీ

తమ వివాహ వేడుక కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకుంది కత్రినా-విక్కీ కౌశల్ జంట. వీరు కలినా విమానాశ్రయంలో అడుగుపెట్టగానే కెమెరాలు వారిని బంధించాయి. ఇద్దరూ మీడియాకు అభివాదం చేస్తూ వివాహ వేదిక వద్దకు బయలుదేరారు. ఇక కత్రినా ఒషేర్ షరారా ఔట్‌ఫిట్‌లో రాకుమారిలా కనిపించగా.. విక్కీ కౌశల్ సైతం కత్రినా ఔట్‌ఫిట్ కలర్‌కు మ్యాచ్‌ అయ్యేలా డ్రెస్ అయ్యాడు. వీరిద్దరితో పాటు వీరి కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులు మాత్రమే కనిపించారు.

సవాయ్ మాధాపూర్‌లోని బర్వారా కోట వీరి వివాహానికి వేదికగా నిలిచింది. ఇప్పటికే ఈ కోటను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. సంగీత్ 7వ తేదీ, మెహెందీ 8వ తేదీన గ్రాండ్‌గా జరగనుండగా... ఇంతకంటే వైభవంగా డిసెంబర్ 9వ తేదీన విక్కీ కౌశల్ కత్రినాల వివాహం జరగనుంది.

తక్కువ మందికి ఆహ్వానం.. కోవిడ్ రూల్స్ తప్పనిసరి

తక్కువ మందికి ఆహ్వానం.. కోవిడ్ రూల్స్ తప్పనిసరి

ఇక కత్రినాను పెళ్లి కూతురు చేసేందుకు ఆమె వ్యక్తిగత సిబ్బంది కూడా రాజస్థాన్‌కు చేరుకున్నారు. కత్రినా స్టైలిస్ట్ అనైటా ష్రాఫ్ అదాజానియా అక్కడ కనిపించింది. ఇక పెళ్లికి దాదాపుగా 120 మందిని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే వీరిలో ఎక్కువ మంది కత్రినా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులని చెబుతున్నారు.

ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్‌కు డైరెక్టర్ కబీర్ ఖాన్, నిర్మాత అమృత్‌పాల్ సింగ్ బింద్రా, డైరెక్టర్ ఆనంద్ తివారీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వివాహానికి వచ్చే అతిథులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకుని ఉండాలనే నిబంధన పెట్టారు. అంటే కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటించాలని చెప్పారు. అంతేకాదు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కూడా ఎంట్రీ వద్ద చూపించాలట.ఈ విషయాన్ని సవాయ్ మాధాపూర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

  Mohammad Kaif Performs ‘Nagin Dance’ After India Wins 4th Test Match Against England|Oneindia Telugu
  సల్మాన్‌కు ఆహ్వానం లేదా..?

  సల్మాన్‌కు ఆహ్వానం లేదా..?

  ఇతర విషయాలకొస్తే సవాయ్ మాధాపూర్‌లోని ధర్మశాలలను ఇప్పటికే బుక్ చేశారు. సల్మాన్ ఖాన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది షేరా సెక్యూరిటీ టీమ్‌ కత్రినా - విక్కీ కౌశల్‌ వివాహానికి సెక్యూరిటీని ఇస్తోంది. ఈ ధర్మశాలలో భద్రతా సిబ్బంది ఉంటారు. ఇక పెళ్లికొడుకు అయిన విక్కీ కౌశల్ ఏడు శ్వేత గుర్రాలపై వివాహ వేదిక వద్దకు ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.

  అయితే కత్రినా వివాహానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌కు ఆహ్వానం లేదని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు సల్మాన్‌ పై కత్రినా మనసు పారేసుకుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత అవి కేవలం రూమర్లకు మాత్రమే పరిమితమయ్యాయి.

  మొత్తానికి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌లు 2019 నుంచి రిలేషన్‌లో ఉన్నప్పటికీ... ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నట్లు బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. అయితే పలుమార్లు ఇద్దరూ కలిసి ఒకే చోట కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ప్రేమయాణం నడుస్తోందని సర్వత్రా చర్చ జరిగింది. ఇప్పుడు ఈ ప్రేమ కాస్త పెళ్లి పీటలకు చేరింది.

  English summary
  Bollywood star actors Katrina Kaif and Vicky Kaushal are all set to tie the knot in Rajasthans Barwara fort on December 9th.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X