• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కౌరవులు టెస్టు ట్యూబ్ బేబీలట... రావణుడి గురించి సంచలన సత్యాలు చెప్పిన ఏయూ వీసీ

|
  Kauravas Of Mahabharata Were Test Tube Babies : Andhra University VC

  మహాభారతం అందరికి తెలిసే ఉంటుంది. భారతం మొత్తంలో పాండవులు కౌరవుల ఘట్టం అతి ప్రాముఖ్యమైనది. అయితే కౌరవుల పుట్టుక గురించి ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్ నాగేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విష్ణువు దశవతారాలకు డార్విన్ సిద్ధాంతానికి సంబంధం ఏమిటి..? ఇంతకీ కౌరవుల జన్మం ఎట్టిది... ఉప కులపతి నాగేశ్వరరావు చెబుతున్నది ఏమిటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

  ఆసక్తి విషయాలు వెల్లడించిన ఏయూ ఉపకులపతి

  ఆసక్తి విషయాలు వెల్లడించిన ఏయూ ఉపకులపతి

  ఆంధ్ర యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ జి. నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో మనం చూసే కౌరవులు పుట్టుక ఆధునిక కాలంలో వినియోగిస్తున్న టెస్టు ట్యూబ్ టెక్నాలజీ ద్వారా జరిగిందని చెప్పారు. ఇది వినటానికి విడ్డూరంగా ఉన్నా ఉపకులపతి చెప్పే స్టోరీ మాత్రం చాలా ఆసక్తి కరంగా ఉంది. అప్పట్లోనే కణాలపై అవగాహన ఉండేదని వెల్లడించారు. అంతేకాదు నేడు యుద్ధం కోసం వినియోగించే క్షిపణి వ్యవస్థ వెయ్యేళ్ల క్రితమే ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు వేదికగా నిలిచింది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు.

  ఆకాశంలో ఉండగా పని చేయని ఇంజిన్, శబ్దంతో ఉగిపోయిన విమానం, అత్యవసర ల్యాండింగ్ ఆకాశంలో ఉండగా పని చేయని ఇంజిన్, శబ్దంతో ఉగిపోయిన విమానం, అత్యవసర ల్యాండింగ్

   క్షిపణి వ్యవస్థ కొన్ని వేళ ఏళ్లకిందటే భారత్‌లో ఉంది

  క్షిపణి వ్యవస్థ కొన్ని వేళ ఏళ్లకిందటే భారత్‌లో ఉంది

  ఇక విష్ణువు దశవతారాలు చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని పోలి ఉంటుందని వెల్లడించారు. అంటే డార్విన్ కంటే ముందే ఆ సిద్ధాంతం మహాభారతంలో ఉందని చెప్పారు. రామాయణంలో రాముడు అస్త్రశస్త్రాలను వినియోగించగా... శత్రువులను వధించేందుకు విష్ణువు సుదర్శన చక్రాన్ని పంపాడు. అంది శతృవులను వధించి తిరిగి చెంతకు చేరుతుందని చెప్పారు నాగేశ్వరరావు. అంటే మన ఆధునిక చరిత్రలో శతృచేధనకు వినియోగించే క్షిపణి వ్యవస్థను కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ప్రవేశపెట్టారని చెప్పారు

   విష్ణువు తొలి అవతారాన్నే డార్విన్ తన సిద్ధాంతంలో వివరించారు

  విష్ణువు తొలి అవతారాన్నే డార్విన్ తన సిద్ధాంతంలో వివరించారు


  రావణాసురుడు పుష్పకవిమానం ఒక్కటే వినియోగించలేదని అలాంటి వివిధ రకాల 24 విమానాలు ఆయన దగ్గర ఉండేవని రామాయణం సుస్పష్టం చేస్తోందని నాగేశ్వరరావు చెప్పారు. అంతేకాదు శ్రీలంకలో వీటికోసం పలు విమానాశ్రయాలు ఉండేవని పేర్కొన్నారు. వీటన్నిటినీ ఆయా పనులకోసం ఆయా సందర్భాల్లో రావణాసురుడు వినియోగించేవాడని చెప్పారు. జీవనం అనేది నీటి నుంచి మొదైలందని డార్విన్ చెప్పారు. విష్ణువు యొక్క తొలి అవతారం మత్స్యావతారం. అంటే చేప. చేప నీటిలోనే ఉంటుందని నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఇక విష్ణువు రెండో అవతారం కూర్మావతారం, మూడోది వరాహావతారం, నాలుగోది నరసింహావతారం, ఐదవది వామనావతారం.

  కౌరవుల పుట్టుక టెస్టుట్యూబ్ బేబీ టెక్నాలజీ ఘనతే..!

  కౌరవుల పుట్టుక టెస్టుట్యూబ్ బేబీ టెక్నాలజీ ఘనతే..!

  ఇక గాంధారీ 100మంది పిల్లలకు ఎలా జన్మనిచ్చిందో నాగేశ్వరావు వివరించారు. ఒక మహిళకు ఇది ఎలా సాధ్యం..? ఇప్పుడు మనకు టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ వచ్చింది. 100 ఫలదీకరణ చెందిన గుడ్లును ఒక కుండలో ఉంచారు అని మహాభారతమే సెలవిస్తోందని నాగేశ్వరరావు చెప్పారు. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీని అప్పుడే వినియోగించారని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వినియోగించిన మూల కణాల గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నామని నాగేశ్వరరావు చెప్పారు. ఈ స్టెమ్ సెల్ పరిశోధనలు టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ ద్వారానే 100 మంది కౌరవులు పుట్టారని చెప్పుకొచ్చారు ఉపకులపతి.

  English summary
  Kauravas were born due to stem cell and test tube technologies and India also possessed knowledge about guided missiles thousands of years ago, claimed Andhra University vice chancellor G Nageshwar Rao at the Indian Science Congress on Friday.He claimed the 'Dashavtar', ten avatars of Lord Vishnu, predate the Theory of Evolution given by English naturalist Charles Darwin.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X