వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి లైంగిక దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన దిలీప్ భార్య కావ్య మాధవన్, అరెస్టు చేస్తారని !

ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం సూపర్ స్టార్ దిలీప్ రెండో భార్య, ప్రముఖ నటి కావ్య మాధవన్ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కేరళ హైకోర్టులో శనివారం మద్యాహ్నం.

|
Google Oneindia TeluguNews

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం సూపర్ స్టార్ దిలీప్ రెండో భార్య, ప్రముఖ నటి కావ్య మాధవన్ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కేరళ హైకోర్టులో శనివారం మద్యాహ్నం అర్జీ సమర్పించారు.

కేరళ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో కావ్య మాధవన్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టు ఆశ్రయించారని మలయాళం మీడియా అంటోంది. 2017 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ పోలీసులకు అనేక విషయాలు చెప్పాడు.

Kavya Madhavan files anticipatory bail peal in Kerala High Court

Recommended Video

Actress Abduction; Pulsar Suni Involvement Reveals | Oneindia Telugu

నటి లైంగిక దాడి కేసులో పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం మేరకు జూన్ 10వ తేదీన మలయాళం సూపర్ స్టార్ దిలీప్ ను అరెస్టు చేశారు. దిలీప్ ప్రస్తుతం ఆలువా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అంగామాలి మెజిస్టేట్ కోర్టులో దిలీప్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.

భర్త దిలీప్ బెయిల్ పిటీషన్ కోర్టులో విచారణకు వచ్చిన రోజే కావ్య మాధవన్ హైకోర్టును ఆశ్రయించారు. దిలీప్ న్యాయవాది బి. రామనపిళ్లై కావ్య మాధవన్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టులో సమర్పించారు. కావ్య మాధన్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ చెయ్యనుంది. కావ్య మాధవన్ ను ఏక్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

English summary
Dileep’s wife and actress Kavya Madhavan filed an anticipatory bail application at the High Court in connection with the actress attack case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X