వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబీసీలో అమితాబ్‌తో డ్యాన్సు, అధికారులకు నోటీసులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

 KBC dance with Amitabh Bachchan costs senior officers, get Raman Singh notice
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో సరదాగా చేసిన డ్యాన్స్ ఆ ఆఫీసర్ల ఉద్యోగానికే చిక్కులు తెచ్చి పెట్టింది. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) కార్యక్రమంలో పాల్గొన్న ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఆ కార్యక్రమ హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో డ్యాన్స్ చేసి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన కేబీసీ షో రికార్డింగ్‌లో అదనపు కార్యదర్శి ఎంకే రౌత్, జాయింట్ సెక్రటరీ విక్రమ్ సిసోడియా (ఈయన సీఎం రమణ్ సింగ్ పేషీలో ఓఎస్డీ కూడా) పాల్గొన్నారు. కార్యక్రమం మధ్యలో వీరు వేదికపైకి వెళ్ళి అమితాబ్ తో కలిసి 'మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై' పాటకు డ్యాన్సు చేశారు.

ఆ డ్యాన్స్ ఇప్పుడు వీరికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ డ్యాన్స్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆగ్రహించారని సమాచారం. సీఏం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ చంద్ వీరిద్దరినీ మందలిస్తూ నోటీసులు పంపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం చేయరాదంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) రాయ్ పూర్ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు. ఈ ఇరువురు అధికారులపై కొందరు చేసిన ఫిర్యాదుల కారణంగానే సీఎం రమణ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

English summary

 They are among the most powerful bureaucrats of Chhattisgarh — one an Additional Chief Secretary and the other a Joint Secretary and the longest-serving OSD (officer on special duty) to Chief Minister Raman Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X