వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకదేశం ఒకేసారి ఎన్నికలపై అఖిలపక్షం.. భేటీకి కేసీఆర్, మమత, స్టాలిన్ డుమ్మా..

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఒకదేశం ఒకేఎన్నికలపై అఖిలపక్షం... కేసీఆర్, మమత, స్టాలిన్ డుమ్మా || Oneindia Telugu

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ చాలా కాలంగా వినిపిస్తున్న నినాదం ఒక దేశం - ఒకేసారి ఎన్నికలు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఆయన అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఒక దేశం - ఒకేసారి ఎన్నికల అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బుధవారం మోడీ నేతృత్వంలో జరగనున్న భేటీలో పాల్గొనాలని లోక్‌సభ, రాజ్యసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానం పంపింది.

ఏకకాల ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో జరగనున్న అఖిలపక్ష భేటీకి తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే చీఫ్ స్టాలిన్ హాజరుకావడంలేదని స్పష్టం చేశారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అనే అజెండాపై ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వకుండా తక్కువ వ్యవధిలో సమావేశం ఏర్పాటుచేసిందని మమత విమర్శించారు. ఈ అంశంపై సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని దీదీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.

KCR, mamata, stalin to skip all party meet on one nation one poll

జమిలి ఎన్నికలపై రాజ్యాంగ, ఎన్నికల నిపుణులతో పాటు అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని, కీలకమైన అంశంపై హడావిడిగా చర్చలు జరపలేమని మమత అభిప్రాయపడ్డారు. అన్ని పొలిటికల్ పార్టీల నుంచి సూచనలు ఆహ్వానించి నిర్దిష్ఠ కాలపరిమితో ఈ ప్రక్రియ చేపట్టాలని దీదీ సూచించారు. మరోవైపు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆల్‌ పార్టీ మీటింగ్‌కు హాజరుకాలేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సమాచారం పంపారు. బుధవారం శివసేన 53వ వ్యవస్థాపక దినోత్సవం కారణంగా ఆయన ఆయన మీటింగ్‌కు హాజరుకాలేకపోతున్నారు.

బడ్జెట్ 2019 : ఆర్థికలోటుపై అంకెల గారడీ.. నిర్మల తొలి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి..బడ్జెట్ 2019 : ఆర్థికలోటుపై అంకెల గారడీ.. నిర్మల తొలి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి..

English summary
Leaders of many Opposition parties are likely to skip the meeting called by Prime Minister Narendra Modi to discuss his “one nation, one election” proposal. TRS chief kcr, mamata,Stalin to skip the meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X