• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్ష బీభత్సం: ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ రివ్యూ.. సహాయక చర్యలు

|

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షం కురిసే ప్రాంతాన్ని బట్టి జోన్లుగా విభజించారు. కీలక సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండిపోయారు. వివిధ పనుల మీద హస్తినలో ఉన్న.. వర్షాలకు సంబంధించి రివ్యూ చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. తెలంగాణలో వానలు, వరద పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)

తరలింపు..

తరలింపు..

వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వర్షాలు, వరద ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. అన్ని విభాగాలు 24 గంటలు అలర్ట్ గా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వర్ష బీభత్సం..

వర్ష బీభత్సం..

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగుతున్నాయి. వరదనీరు పోటెత్తడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు గ్రామాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణాల్లోని కాలనీలు, రోడ్లు నదుల మాదిరిగా మారిపోయాయి. వరద నీటి తరలింపు చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిపెట్టింది.

బిజీ బిజీ

బిజీ బిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. ప్రధాని మోడీకి తమ సమస్యలను సంగతి తెలిసిందే. నిన్ప కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. ఎన్ హెచ్ 165 హైదరాబాద్ (ఓఆర్ఆర్) కల్వకుర్తి వరకు ఉన్న రహదారి నాలుగు లైన్ల రహదారిగా గుర్తించాలని సిఎం కేసీఆర్ గడ్కరీని కోరారు. 2021-2022, 2022-2023 రెండు ఆర్థిక సంవత్సరాల్లో సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) కింద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించాలని కూడా సీఎం గడ్కరీ కి విజ్ఞప్తి చేశారు.

10 అంశాలపై చర్చ

10 అంశాలపై చర్చ

ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ ఈ మధ్య సమావేశం అయ్యారు. 10 అంశాలపై చర్చ జరిగింది. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలని మోడీని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని విన్నవించారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కోరారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని.. 10 అంశాలకు సంబంధించిన లేఖలు అందజేశారు.

English summary
KCR review Telangana flood situation from Delhi. he is presently delhi for state issues discuss to central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X