వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాస్పద వ్యాఖ్యలు: 'వాళ్లు హిందువులు కాదు, ఆలయ విశ్వసనీయత దెబ్బతింటుంది'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జ్యోతి‌మఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ పూజారులు హిందువులు కాదని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో మీడియాతో మాట్లాడుతూ కేదార్‌నాథ్ హిందూ దేవాలయమని, అయితే పూజారులు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు. లింగాయత్ సామాజిక వర్గీయులు తమను తాము హిందువులుగా పరిగణించరని, అలాంటప్పుడు వారెలా పూజారులుగా కొనసాగుతారని మండిపడ్డారు.

Shankaracharya

బద్రీనాథ్ క్షేత్ర పూజారులకు ఇది వర్తిస్తుందని అన్నారు. బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేసిన తర్వాత, పూజారులు జోషిమఠంలో ఉండాల్సింది పోయి, దేశ సంచారం చేస్తున్నారని విమర్శించారు. వారు ప్రవర్తించే తీరు బద్రినాథ్ ఆలయ విశ్వసనీయత దెబ్బతీసే విధంగా ఉందన్నారు.

అలాంటి వారు కొంత కాలం బ్రహ్మచర్యం పాటించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుటుందని ఆరోపించారు.

English summary
Sparking another controversy, Jyotirmath Sankaracharya Swaroopananda Saraswati has said that the Rawals (Priests) at the Kedarnath shrine should be sacked from their postsas they are not Hindus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X