వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.50 వేలకు పైగా ఆభరణాలు కొనుగోలు చేస్తే ఆధార్ నెంబర్ తప్పనిసరి

యాబై వేల కంటే ఎక్కువ మొత్తంలో బంగారం , వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే ఆధార్ లేదా, పాన్ కార్డు నెంబర్ తప్పనిసరిగా చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: యాభై వేల రూపాయాల కంటే ఎక్కువ మొత్తంలో బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు నెంబర్ ను ఉండాల్సిందే.అయితే కేంద్ర బడ్జెట్ తర్వాత ఈ నిబంధనను అమలు చేసే అవకాశం ఉంది.

2017 కేంద్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో సామాన్యుడికి, మధ్యతరగతికి కేంద్రం వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2017 బడ్జెట్ తర్వాత కొన్నికొత్త నిబంధనాలను కేంద్రం అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. యాభై వేల కంటే ఎక్కువ బంగారు , వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే ఆధార్, పాన్ కార్డు నెంబర్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం రెండు లక్షల కంటే ఎక్కువ ఆభరణాలను కొనుగోలు చేస్తేనే ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును తప్పనిసరి అనే నిబంధన ఉంది.

యాభై వేలకు పైగా ఆభరణాలు కొనుగోలుచేస్తే ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే

యాభై వేలకు పైగా ఆభరణాలు కొనుగోలుచేస్తే ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే

2017 కేంద్ర బడ్జెట్ తర్వాత సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు వరాల జల్లు కురిపించే దిశగా కేంద్రం నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.అయితే కొన్ని నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.

నల్లధనం నిర్మూలనకే

నల్లధనం నిర్మూలనకే

నల్లధనం నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను గత ఏడాది నవంబర్ లో పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.అయితే నల్లధనాన్ని మార్పిడి చేసుకొన్న అక్రమార్కులు ఈ నగదును బంగారం కొనుగోళ్ళపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అక్రమార్కులకు చెక్ పెట్టేందుకే

అక్రమార్కులకు చెక్ పెట్టేందుకే

ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తూ కోట్లు దండుకొంటున్నవారికి చెక్ పెట్టేందుకుగాను ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మొత్తంలో సంపాందించి ప్రభుత్వానికి తక్కువ మొత్తంలో పన్నులు చెల్లించేవారు ఉన్నారు. అయితే వీరంతా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీంతో బంగారం కొనుగోళ్ళపై కేంద్రీకరిస్తే అక్రమార్కులకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని సర్కార్ భావిస్తోంది.

ఆధార్, పాన్ కార్డు నెంబర్లతో అక్రమాలక్ చెక్

ఆధార్, పాన్ కార్డు నెంబర్లతో అక్రమాలక్ చెక్

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బంగారం, రియల్ ఏస్టేట్ మార్కెట్ లోకి అక్రమార్కులు రద్దుచేసిన నగదును పెట్టుబడులుగా పెట్టారని ఇన్ కమ్ ట్యాక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటలిజెన్సీ ఏజెన్సీలు నిమగ్నమయ్యాయి. కెవైసీ అవసరాన్ని సమీక్షించి వచ్చే బడ్జెట్ లో రూ. లక్షకు మించి కొనుగోళ్ళు చేస్తే ఈ నిబంధనలు తీసుకొచ్చే అవకాశాలున్నాయని నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా బులియన్ అండ్ జ్యూయల్లర్స్ అసోసియేషన్ సురేంద్రమోహతా చెబుతున్నారు.

English summary
currently only purchases above 2 lakh require know your customer compliance in gold market , keep handy pan card, aadhar purchases jewellery post 2017 budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X