వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: కేజ్రీవాల్ భారీ ఆర్థికసాయం, రోగులకు చికిత్స అందించి చనిపోయే సిబ్బంది ఫ్యామిలీ రూ.కోటి

|
Google Oneindia TeluguNews

కరోనా రక్కసితో పోరాడుతోన్న రోగులకు వైద్యం అందిస్తోన్న వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది సేవలు వెలకట్టలేం. వారి చేస్తోన్న పనిని ప్రతీ ఒక్కరు వారి చేస్తోన్న పనిని అభినందిస్తున్నారు. తెల్ల కోటు వేసుకున్న వైద్యులు దేవుళ్లు అని మోడీ అనగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైద్యులను కాపాడుకోవాల్సిన అసవరం ఉందన్నారు. మరో అడుగు ముందుకేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. రోగులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు, సిబ్బంది, క్లీన్ చేస్తున్న పారిశుద్ద్య కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు

ఆర్థిక భరోసా

కొన్ని సందర్భాల్లో వైద్యులు, సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. వారు కూడా చికిత్స తీసుకొంటారు. కానీ జరగరానిది ఏమైనా జరిగి.. చనిపోతే వారికి అండగా ఉంటామని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. చనిపోయిన వైద్యులు/సిబ్బంది, పారిశుద్ద్య కార్మికుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 లక్షల వరకు సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎక్కడ పనిచేసినా సరే..

ఎక్కడ పనిచేసినా సరే..

కేజ్రీవాల్ మాత్రం వారి పట్ల ఉదారత కనబరిచారు. వైద్యులు/సిబ్బంది, కార్మికులు ఎక్కడ పనిచేసి చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేస్తామని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. దీనికి ప్రభుత్వ/ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తే అనే నిబంధన ఏమీ లేదని స్పష్టంచేశారు. వాస్తవానికి ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వారికి ప్రభుత్వం ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటుంది. కానీ కరోనా విపత్తు నేపథ్యంలో ప్రభుత్వాలు నిబంధనలను సడలిస్తోంది. అందరికీ సమన్యాయం చేస్తామని ప్రకటించింది.

మర్కజ్ ప్రార్థనలతో..

మర్కజ్ ప్రార్థనలతో..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడికి విదేశీ ప్రతినిధులు హాజరుకాగా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. తర్వాత వారికి వైరస్ సోకినట్టు బయటపడటంతో హై టెన్షన్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యి మంది వరకు వెళ్లారని తెలియడంతో వారిని గుర్తించడమే గాక.. ఎవరెవరితో కలిశారని ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో రోగులకు చికిత్స అందిస్తోన్న వారికి ఏమైనా జరిగితే వారి కుటుంబసభ్యులకు కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం ప్రకటించింది.

English summary
delhi chief mininster aravind Kejriwal announces Rs 1 crore for medical workers who might lose life in Covid-19 fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X