వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కుమారుడు తప్పు చేసినా జైలుకు పంపిస్తా: కేజ్రీవాల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన కుమారుడు తప్పు చేసినా జైలుకు పంపిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆఫీసుపై మంగళవారం సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ సీబీఐ దాడులు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు.

తమ ప్రభుత్వాన్ని సీబీఐ టార్గెట్ చేసుకుందన్నారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అవినీతిలో ప్రమేయం ఉంటే తన కొడుకునైనా జైలుకు పంపిస్తానని కేజ్రీవాల్ అన్నారు. తన కార్యదర్శి రాజేంద్ర కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వాళ్లకు టార్గెట్ తన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కాదని, తానేనని అన్నారు.

తన కార్యదర్శిగా ఉన్న రాజేంద్ర కుమార్‌పై వచ్చిన ఆరోపణలు 2007-14 కాలం నాటివని, అతనిని అడ్డుగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉన్న డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) ఫైళ్ల కోసమే సోదాలు నిర్వహించారని ఆయన విమర్శించారు.

Kejriwal claims Jaitley's name present in DDCA files which CBI came looking for

తన కార్యాలయంలోని ప్రతి ఫైల్‌ను సీబీఐ సోదాలు చేసిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని, అందుకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేశామన్నారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కాపాడుకునేందుకే తన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించిందన్నారు.

ఈ సోదాల్లో సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున నగదు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలోని 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిబిఐ.. రాజేంద్ర కుమార్ నివాసం మూడు దస్తాలు, రూ.2.4 లక్షలను స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది.

కాగా సీబీఐ దాడులపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసే దాడులు జరిపారన్నారు. దీనిపై ప్రధాని మోడీతో బహిరంగ చర్చకు సిద్థమని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉంటే కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు జరపటాన్ని పశ్చిమ బెంగాల్, బిహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ తప్పుబట్టారు.

English summary
CBI on Tuesday conducted searches at the office of Delhi Chief Minister Arvind Kejriwal and over a dozen other places after it registered a corruption case against his Principal Secretary Rajendra Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X