వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచిన రెండోరోజే షాకిచ్చిన కేజ్రీవాల్.. ఆతిషి, రాఘవ్‌కు మొండిచెయ్యి..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బంపర్ విక్టరీకి దోహదపడిన ఇద్దరు కీలక వ్యక్తులకు కేజ్రీవాల్ షాకిచ్చారు. ఢిల్లీ సీఎంగా ఆదివారం ప్రమాణం చేయనున్న ఆయన.. కేబినెట్ లోకి కొత్త వాళ్లను తీసుకోకుండా, పాత మంత్రివర్గాన్నే కొనసాగించాలని డిసైడయ్యారు. తద్వారా కేబినెట్ లో చోటు ఖాయమనుకున్న ఆతిషి మర్లేనా, రాఘవ్ చద్దాలకు మొండిచెయ్యి చూపారు.

స్కూళ్లను బాగుచేసింది ఆమెనే..

స్కూళ్లను బాగుచేసింది ఆమెనే..

ఆప్ నేతల్లో కేజ్రీవాల్, సిసోడియా తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదిన వ్యక్తుల్లో ఆతిషి మర్లేనా ఒకరు. గత లోక్ సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీచేసి క్రికెటర్ గౌతం గంభీర్ పై ఓడిపోయిన ఆమె.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి 11,393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్న ఆతిషి.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సలహాదారుగా ఉంటూ ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. సలహాదారుల నియామకం చట్టవిరుద్ధమని కేంద్రం అభ్యంతరం చెప్పడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆతిషికి ఢిల్లీ విద్యా మంత్రి పదవి దక్కుతుందని జోరుగా ప్రచారంజరిగింది. కానీ సీఎం మాత్రం అందుకు సానుకూలంగా స్పందించలేదు.

ఉచిత పథకాల ఐడియా చద్దాదే..

ఉచిత పథకాల ఐడియా చద్దాదే..

ఢిల్లీలో ఆప్ కు తిరుగులేని మెజార్టీ అందించిన ఉచిత పథకాల రూపకర్త రాఘవ్ చద్దాను కూడా కేబినెట్ లోకి తీసుకోరాదని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వృత్తిపరంగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన చద్దా.. ఢిల్లీ ఆర్థిక శాఖకు ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. కేంద్రం అభ్యంతరంతో ఆ పదవిని వదులుకున్నారు. తాజా ఎన్నికల్లో రాజిందర్‌నగర్ నియోజకవర్గం నుంచి 20, 058 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆప్ అధికార ప్రతినిధి, లీగల్ వ్యవహారాల ఇన్ చార్జిగానూ కొనసాగుతన్న ఆయనకు కొత్త కేబినెట్ లో చోటు ఖాయమని అందరూ భావించినా చివరికి అలా జరగలేదు.

ఆదివారం ప్రమాణం చేసేది వీళ్లే..

ఆదివారం ప్రమాణం చేసేది వీళ్లే..


కేబినెట్ లో మార్పులు చేయరాదని కేజ్రీవాల్ నిర్ణయించడంతో ఆదివారం ఆయనతోపాటు మరో ఆరుగురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మనీష్ సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు. సత్యేంద్ర కుమార్ జైన్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర పాల్ గౌతం, కైలాశ్ గెహ్లాట్ లు యధావిధిగా మంత్రిపదవుల్లో కొనసాగనున్నారు.

ప్రధాని మోదీకి ఆహ్వానం?

ప్రధాని మోదీకి ఆహ్వానం?

మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లు సాధించిన ఆప్ ఢిల్లీలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ప్రఖ్యాత రాంలీలా మైదాన్ లో సీఎంగా కేజ్రీవాల్, కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణస్వీకారాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు ఆప్ వర్గాలు చెప్పాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. ప్రధానిని పిలుస్తారా లేక ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల్నిపిలుస్తారా అనేది ఒకటిరెండురోజుల్లో స్పష్టతవచ్చే అవకాశముంది.

English summary
Arvind Kejriwal is likely to retain all the cabinet ministers who were part of his previous government, there might be no chance for Atishi, Raghav Chadha, Aam Aadmi Party (AAP) sources said on Wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X