వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

96 శాతంతో సత్తా చాటిన కేజ్రీవాల్ కూతురు హర్షిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఇంటర్‌లో సత్తా చాటారు. ఆమె సిబిఎస్ఈ క్లాస్ 12 పరీక్షల్లో 96 పర్సెంట్ సాధించారు. హర్షిత సైన్స్ విద్యార్థిని. తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని చెప్పారు. ఐఐటిలో చదవడం ఇష్టమన్నారు.

ప్రస్తుతం ఐఐటిలో అడ్మిషన్ పొందడం తన లక్ష్యమన్నారు. హర్షిత నోయిడాలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని. ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించిన హర్షిత... ఫిజిక్స్ తన సబ్జెక్ట్ అని చెబుతున్నారు.

Kejriwal’s daughter scores 96 per cent in class XII exam

అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నాయకులు. దీంతో ఆయన ఇంటికి ఎప్పుడు కార్యకర్తలు, నాయకుల తాడికి ఉంటుంది. మధ్య ఢిల్లీలోని తిలక్ లేన్‌లో వీరు ఇల్లు ఉంది. నిత్యం ఇంటికి కార్యకర్తల తాడికి ఉన్నప్పటికీ ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తన ఇంటికి ఎప్పుడు సందడిగా ఉంటుందని, అయినప్పటికీ తాను చదువు పైనే దృష్టి సారించానని చెప్పారు.

తన ఇంటిలో జరిగే రాజకీయ సమావేశాలు, ఇతర రాజకీయ కార్యక్రమాల గురించి తాను ఎప్పుడు పట్టించుకోలేదని చెప్పారు. కాగా, హర్షిత అత్యధిక మార్కులు సాధించినందుకు కేజ్రీవాల్‌కు కార్యకర్తలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీ వారికి ధన్యవాదాలు తెలిపారు.

English summary
Her residence may have been the centre of a political storm for over a year but that did not deter Harshita, daughter of AAP leader Arvind Kejriwal, who came out with flying colours scoring 96 per cent in her class XII CBSE exam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X