• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర చట్టాలను చించిపారేసిన సీఎం కేజ్రీవాల్ -వ్యవసాయ చట్టాల తిరస్కరిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం

|

సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు గురువారానికి 22వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలకు దిగిన అన్నదాతలు ఇప్పటికే దేశవ్యాప్త నిరసనలు, భారత్ బంద్ లాంటి కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం దిగిరావడంలేదు. దీంతో రైతుల అవస్థలు చూసి మనస్తాపంతో సిక్కు మతగురువు బాబా రామ్ సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వివిధ కారణాలతో రోజుకు కనీసం ఒకరు చొప్పున రైతులు కన్నుమూస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో కదలిక లేకపోవడాన్ని విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ముఖ్యంగా...

ఢిల్లీ అసెంబ్లీలో కేంద్ర వ్యవసాయ చట్టాలపై చర్చ సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం తీరుపై ఫైరయ్యారు. వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాల్సిందిగా గడిచిన రైతులు చేస్తోన్న నిరసనల్లో రోజుకు సగటున ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ఆ కోపంలో.. కొత్త వ్యవసాయ చట్టాల తాలూకు కాపీలను సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా చించిపారేసి, కేంద్రంపై తన నిరసనను తెలిపారు.

జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనం

Kejriwal Tears Copies of Farm Laws in delhi Assembly, passes resolution against Farm Laws

కేంద్రప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ గొంతుక వినిపించేలా చేసేందుకు రైతులు ఇంకెన్ని త్యాగాలు చేయాలంటూ సీఎం భావోద్వేగంగా మాట్లాడారు. కొత్త రైతులకు పూర్తి వ్యతిరేకమైనవని, వీటిని అమలు చేస్తే దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని, కొద్ది మంది పెట్టుబడిదారులకు మాత్రమే ఈ చట్టాలు ప్రయోజనకరంగా ఉంటాయని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.

పెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషి

వ్యవసాయ చట్టాల కోసమే ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ఢిల్లీ ప్రభుత్వం.. సదరు చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆప్ ఎమ్మెల్యేలు నరేంద్ర గోయల్,సోమ్ నాథ్ భారతిలు సైతం నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కాపీలను చించేశారు. రైతులతో చర్చలకు సిద్ధం అంటోన్న కేంద్ర ప్రభుత్వం.. వారి డిమాండ్లను మత్రం అంగీకరించకపోవడంతో నిరసనలు కొనసాగుతున్నాయి.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal on Thursday tore up copies of the Centre's three new agriculture-related laws in the legislative assembly, saying he cannot betray the country's farmers. Addressing the Delhi Assembly, the chief minister also alleged that the laws have been made for electoral funding of the BJP and not the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X