• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేజ్రీవాల్ ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్: గ్రాండ్‌గా..: కనీసం 50 వేల మంది: కనివినీ ఎరుగని భద్రత..!

|
  Arvind Kejriwal To Take Oath As Delhi CM @ Ramlila Maidan On February 16

  న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఇది. సుమారు 48 గంటలుగా ట్విట్టర్‌లో హైరేంజ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్న పేరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, మూడుసార్లు హస్తినను ఏకచ్ఛాత్రాధిపత్యం కింద ఏలిన కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు మట్టి కరిపించిన నేతగా కీర్తిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీని కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం చేశారాయన. కాంగ్రెస్ పార్టీ బోణీ కూడా కొట్టలేకపోయింది.

  Sugali Preethi: పవన్ ర్యాలీకి ఒక్క రోజు ముందు: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి: త్వరలో ఆ రెండు కూడా.. !

  16న ప్రమాణ స్వీకారం..

  16న ప్రమాణ స్వీకారం..

  అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో.. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆమ్ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నెల 16వ తేదీన.. అంటే ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక రామ్‌లీలా మైదాన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వేదిక ఎక్కడనేది స్పష్టం కావడంతో.. ఢిల్లీ పోలీసులు రామ్‌లీలా మైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నారు.

  కనీసం 50 వేల మందికి..

  కనీసం 50 వేల మందికి..

  ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించిందో.. అంతే గ్రాండ్‌గా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతుండటం ఇది మూడోసారి. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

  కనీసం 50 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయనుంది. బీజేపీయేతర పార్టీల నాయకులు, పలువురు ముఖ్యమంత్రులకు ఆహ్వాన పత్రాలు అందనున్నాయి.

   మమతా బెనర్జీ, పినరయి సహా..

  మమతా బెనర్జీ, పినరయి సహా..

  కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), పినరయి విజయన్ (కేరళ), నవీన్ పట్నాయక్ (ఒడిశా) ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తదితరులు హాజరు కావడం దాదాపు ఖరారైనట్టేననని అంటున్నారు. జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి లేదా.. ఆయన పార్టీ ప్రతినిధులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరకావచ్చని తెలుస్తోంది.

  ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కాల్పులతో..

  ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కాల్పులతో..

  ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన నేపథ్యంలో.. రామ్‌లీలా మైదానానికిి భారీ భద్రతను కల్పించబోతోంది ప్రభుత్వం. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కాబోతున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టనుంది. రామ్‌లీలా మైదానానికి వచ్చే వారిపై నిఘా ఉంచనుంది. డ్రోన్ల సహకారంతో భద్రతను పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి.

  English summary
  Aam Aadmi Party (AAP) President Arvind Kejriwal to take oath as the Chief Minister of Delhi on 16th February, at Ramlila Maidan in Delhi. Kejriwal has led the Aam Aadmi Party to a stupendous victory yet again in the Delhi Assembly poll. Arvind Kejriwal has led the Aam Aadmi Party to a stupendous victory yet again in the Delhi Assembly poll, dealing a blow to the main rival BJP and completely decimating the Congress.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more