వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..

|
Google Oneindia TeluguNews

మహిళలపై జరుగుతోన్న అకృత్యాల్లో ఇది మరో మెట్టు.. చిన్నాపెద్దా, వావివరుసలు లేకుండా ప్రవర్తించే మృగాడు.. ఇప్పుడు కరోనా బాధితులనూ వదలడంలేదు. కరోనా రోగుల్ని జాగ్రత్తగా ఆస్పత్రికి చేర్చాల్సిన 108 అంబులెన్స్ డ్రైవరే.. కామంతో కళ్లుమూసుకుపోయి మహిళా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సంచలనం రేపిన ఈ సంఘటన తర్వాత కొవిడ్ నిబంధనల్ని సైతం సవరించారు..

Recommended Video

COVID-19 Regulations Till July 2021 In Kerala కరోనా వైరస్ నిబంధనలు జూలై 2021 వరకూ...!! || Oneindia

చైనా మరో సంచలనం: రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..చైనా మరో సంచలనం: రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..

పెద్దావిడను దింపేసి..

పెద్దావిడను దింపేసి..

కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కరోనా బాధిత యువతిపై 108 అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారిది. దీనిపై పోలీసులు, వైద్య శాఖ అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. పతనంతిట్టకు చెందిన యువతి.. ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఈ దారుణం జరిగింది. కేరళలో కొవిడ్ నిబంధనల ప్రకారం పేషెంట్లందరూ విధిగా అంబులెన్సుల్లోనే ఆస్పత్రులకు వెళ్లాలి. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఇద్దరు మహిళలు శనివారం సాయంత్రం 108కు కాల్ చేశారు. రోగులు ఇద్దరినీ బండిలో ఎక్కించిన డ్రైవర్.. పెద్దావిడను ఓ ఆస్పత్రిలో దింపేసి.. యువతిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఆ మాటను అవకాశంగా తీసుకుని..

ఆ మాటను అవకాశంగా తీసుకుని..

పతనంతిట్ట సంఘటనలో శనివారం రాత్రి అంబులెన్స్ లో ఇద్దరు మహిళలు ప్రయాణించారు. పెద్దావిడను దింపేసిన ఆస్పత్రిలో అప్పటికే బెడ్లు ఫుల్ కావడంతో రెండో పేషెంట్(యువతిని) వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఆ మాటను అవకాశంగా తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్.. వాహనాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై బలవంతానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించాడు. అకృత్యం పూర్తయిన తర్వాత ఆమెను ఆస్పత్రిలో వదిలేశాడు.

వాడి పేరు నౌఫాల్.. గతంలోనూ..

వాడి పేరు నౌఫాల్.. గతంలోనూ..

ఎట్టకేలకు ఆలస్యంగానైనా ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితురాలు.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని సిబ్బందికి తెలియజేసింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫిర్యాదు కూడా నమోదైంది. సదరు అంబులెన్స్ వివరాలు సేకరించిన పోలీసులు.. ఆదివారం డ్రైవర్ నౌఫాల్(25)ను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో అత్యాచారం నిజమేనని నిర్ధారణ అయింది. అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ గతంలోనూ పలు నేరాలు చేశాడని, ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగానూ ఉన్నాడని వెల్లడైంది.

అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా - ఇలాంటి చరిత్రహీనుడు ఎవర్ ఆఫ్టర్ - విజయసాయిరెడ్డి ఫైర్అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా - ఇలాంటి చరిత్రహీనుడు ఎవర్ ఆఫ్టర్ - విజయసాయిరెడ్డి ఫైర్

మంత్రి శైలజ షాక్..

మంత్రి శైలజ షాక్..

పతనంతిట్టలో మహిళా కొవిడ్ రోగిపై 108 అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడని విని షాక్ కు గురయ్యానని కేరళ వైద్య శాఖ మంత్రి కేకే శైలజ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. నింతితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని, బాధిత యువతికి అండగా ఉంటామని చెప్పారు. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తికి 108 సర్వీసులో ఉద్యోగం ఎలా వచ్చిందనేదానిపైనా విచారణ చేయిస్తామన్నారు.

ఇకపై అంబులెన్స్ లపై గట్టి నిఘా..

ఇకపై అంబులెన్స్ లపై గట్టి నిఘా..

కరోనా రోగిపై రేప్ సంఘటన నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను సైతం మార్చుతామని, ఇకపై రాత్రి సమయంలో 108 అంబులెన్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండేలా, మహిళా రోగుల్ని తీసుకెళ్లే క్రమంలో మరింత జాగ్రత్త వహించేలా చర్యలకు ఆదేశిస్తామని మంత్రి శైలజ తెలిపారు. అరెస్టు అనంతరం అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ ను ఐసోలేషన్ కు తరలించి, టెస్టులు చేయించామని పోలీసులు చెప్పారు.

English summary
An ambulance driver was arrested for allegedly raping a 19-year-old coronavirus patient in Kerala's Pathanamthitta district. The incident took place on Saturday night. The accused identified as Noufal, 25. Kerala Health Minister KK Shylaja has expressed shock over the incident and directed the concerned department to dismiss the driver from 108 ambulance service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X