వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ABP C-Voter Opinion poll:కేరళలో వార్ వన్‌సైడే: ఎల్‌డీఎఫ్‌ హవా..40 ఏళ్లలో తొలిసారిగా ఇలా..!

|
Google Oneindia TeluguNews

కేరళ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే ఒపీనియన్ పోల్స్ హడావుడి ప్రారంభమైంది. జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ మరియు సీ ఓటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో ఓటర్ల నాడి ఎలా ఉందో ఏ పార్టీని వారు ఆదరిస్తున్నారో అనే కీలక అంశాలను సర్వే చేసి వెల్లడించింది. కేరళ‌లో వార్ వన్‌సైడ్‌గానే ఉంటుందని ఒపీనియన్ పోల్స్ ద్వారా తెలుస్తోంది.ఇక ఈ రాష్ట్రంలో ఓటరు నాడి ఎలా ఉందో చూద్దాం.

కేరళలో అధికారిక ఎల్‌డీఎఫ్ పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని ఏబీపీ సీ ఓటర్ సర్వే జోస్యం చెప్పింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ పార్టీ 83 నుంచి 91 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఒపీనియన్ పోల్స్ ద్వారా వెల్లడైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు శృంగభంగం తప్పేలా లేదు. ఆ కూటమికి 47 నుంచి 55 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింద. 2016లో 47 సీట్లకు కాంగ్రెస్ కూటమి పరిమితం కాగా.. ఈ సారి కాస్త ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

pinrayi vijayan

అయ్యప్ప స్వామి ఆలయం సెంటిమెంటుతో కేరళలో పాగా వేయాలని భావించిన కమలనాథులకు ఈ సారి ఆ అవకాశం ఉండకపోవచ్చు. కేరళ రాష్ట్రంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపదని ఏబీపీ సీఓటర్ సర్వే వెల్లడించింది. బీజేపీ కేరళలో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 0 నుంచి 2 సీట్లు మాత్రమే సాధిస్తుందని సర్వే లెక్క కట్టింది. ఇక 2016 ఫలితాలతో పోలిస్తే ఎల్‌డీఎఫ్ 3.4శాతం ఓట్ల శాతం కోల్పోతుండగా.. కాంగ్రెస్ 6.2శాతం, బీజేపీ 2.2 శాతం ఓట్ల శాతం కోల్పోనుంది.

కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు ఐదేళ్లకోసారి అధికారంలోకి వస్తున్నాయి. గత 40 ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది. అయితే ఈ సారి మాత్రం పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ ద్వారా వెల్లడవుతోంది. కరోనావైరస్ కష్టకాలంలో అధికారిక ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం రేషన్ కిట్లను సరఫరా చేసి ప్రజల మన్ననలను పొందింది. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా రేషన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందుకోసం పినరాయి విజయన్ ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించింది.

మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన ఆ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుండగా... 2 మే 2021న ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
According to ABP survey LDF most likely to return to power in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X