• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kerala సంచలనం: మోదీ దిమ్మతిరిగేలా -దేశమంతటా ఉచిత వ్యాక్సిన్ల కోసం అసెంబ్లీ తీర్మానం -వీణా జార్జ్ ఫైరింగ్

|

ప్రపంచ టీకాల రాజధానిగా పేరున్న ఇండియాలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం, అనుమతి పొందిన రెండు ఫార్మా కంపెనీలు కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ధరలు నిర్ణయించడం, ఓ వైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయకపోవడం, రాష్ట్రాలు సొంతగా గ్లోబల్ టెండర్లకు వెళదామన్నా కేంద్రం అడ్డుగోడలా నిలబడటం లాంటి పరిణామాలు దేశంలో ఫెడరల్ వ్యవస్థకు సవాలుగా మారాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ యేతర రాష్ట్రాలన్నీ గగ్గోలు పెడుతుండగా, కేరళ మరో అడుగు ముందుకేసి సంచలన చర్యకు పూనుకుంది..

మోదీకి భారీ షాక్ :రాష్ట్రాల సిండికేట్ -వ్యాక్సిన్ల కోసం బీజేపీయేతర 11 సీఎంల ఐక్యత -విజయన్ సంచలన లేఖలుమోదీకి భారీ షాక్ :రాష్ట్రాల సిండికేట్ -వ్యాక్సిన్ల కోసం బీజేపీయేతర 11 సీఎంల ఐక్యత -విజయన్ సంచలన లేఖలు

 వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వాల్సిందే..

వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వాల్సిందే..

మోదీ నేతృత్వంలోని కేంద్రం జాతీయ టీకా విధానాన్ని ప్రకటిస్తూ, 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకాలను కేంద్రం సరఫరా చేయబోదని, రాష్ట్రాలే సమకూర్చుకోవాలని, 45ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే కేంద్రం టీకాలను అందిస్తుందని చెప్పడం తెలిసిందే. అయితే దేశ జనాభాలో 18-44 ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉండటం, వారికి టీకాలేసే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడం వివాదాస్పదమైంది. ఈ విషయమై ఇప్పటికే బీజేపీయేతర పార్టీలన్నీ బాహాటంగా విమర్శలు చేశాయి. ఇప్పుడు కేరళ ఏకంగా అసెంబ్లీలో తీర్మానమే చేసంది. ఎన్నికల తర్వాత తొలిసారి సమావేశమైన సభ.. తొలిరోజైన బుధవారమే ప్రధాని మోదీకి దిమ్మతిరిగేలా తీర్మానాన్ని ఆమోదించింది. దేశ ప్రజ‌లంద‌రికీ ఉచితంగా కోవిడ్ టీకాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఏర్పాట్లు చేయాల‌ని కేర‌ళ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా తీర్మానం చేసింది.

 వీణా జార్జ్ ఫైరింగ్ స్పీచ్..

వీణా జార్జ్ ఫైరింగ్ స్పీచ్..

దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు అందించాలన్న తీర్మానాన్ని కేరళ కొత్త ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఫైరింగ్ స్పీచ్ ఇచ్చారు. దేశ ప్ర‌జ‌లంద‌రికీ స‌రిప‌డా వ్యాక్సిన్లు అందే విధంగా కేంద్ర ప్ర‌భుత్వమే గ్లోబ‌ల్ టెండ‌ర్లు వేయాల‌నీ తీర్మానంలో కోరారు. దేశంలో ఓ రాష్ట్ర అసెంబ్లీ ఇలా వ్యాక్సిన్ల కోసం తీర్మానం పాస్ చేయ‌డం ఇదే మొద‌టిసారని, గ‌తంలో ప్ర‌మాద‌క‌ర‌మైన అంటువ్యాధుల‌ను నియంత్రించేందుకు జాతీయ వ్యాక్సిన్ విధానం ఉండేద‌ని, మోదీ హయాంలో ఆ విధానాలకు స్వస్తి పలికి, కొత్త కమర్షియల్ కొత్త పంథాలో వెళ్తోంద‌ని, ఉచిత టీకాలు ఇవ్వ‌డానికి బ‌దులుగా.. మార్కెట్ నుంచి టీకాలు కొనుగోలు చేసుకోవాల‌ని రాష్ట్రాల‌నే ఆదేశిస్తోంద‌ని, దీన్ని ఖండిస్తున్నామ‌ని వీణా జార్జ్ అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యాక్సిన్లు..

ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యాక్సిన్లు..

ఉచిత వ్యాక్సిన్లకు సంబంధించి కేరళ అధికార లెఫ్ట కూటమి పెట్టిన తీర్మానాన్ని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి సైతం బలపర్చడంతో ఏకగ్రీవ ఆమోదం లభించింది. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్ల‌పై ఖ‌ర్చు చేసే నిధుల‌ను వృధాగా వెళ్తున్న‌ట్లుగా మోదీ సర్కార్ భావించరాదని, దీని వ‌ల్ల మ‌ళ్లీ ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి గాడిలో ప‌డుతుంద‌ని, వ్యాక్సినేష‌న్‌తోనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్య‌మ‌ని, అంద‌రికీ వ్యాక్సిన్లు అందాలంటే, అప్పుడు ఉచితంగా టీకాలు ఇవ్వాల‌ని కేరళ అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్రం తన బాధ్యత అయిన మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకోవాలని చూడటం దారుణమని, దీన్ని రాష్ట్రాలన్నీ ఖండించాలని, టీకాల కోసం జరిపే పోరాటంలో ఏకమవుదామంటూ కేరళ సీఎం పినరయి విజయన్ మే 31న బీజేపీ యేతర 11 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడం తెలిసిందే. లోపభూయీష్టమైన జాతీయ వ్యాక్సిన్ విధానం వల్ల ఫెడరల్ వ్యవస్థ దెబ్బతినే పరిణామాలు జరుగుతున్నా కేంద్రం ఇంకా నిద్ర నటిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్ డీలా-డ్రాగన్ జోరు: చైనా తయారీ రెండో వ్యాక్సిన్ 'సైనోవాక్'కు WHO అనుమతి -మన ఫార్మాకు దెబ్బభారత్ డీలా-డ్రాగన్ జోరు: చైనా తయారీ రెండో వ్యాక్సిన్ 'సైనోవాక్'కు WHO అనుమతి -మన ఫార్మాకు దెబ్బ

English summary
Kerala state assembly on Wednesday passed unanimous resolution demanding the Centre to provide Covid vaccines free of cost and in a time-bound manner. The resolution moved by the health minister Veena George was also critical of the vaccine policy which pushed the states to compete in the market for vaccine purchase. The resolution also mooted the use of provisions of compulsory licensing to make vaccines in public sector pharmaceutical companies. this is first time that a state assembly passes resolution for free vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X