వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల తెమ్మన్న గంటల్లోనే ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి: నలుగురికి తీవ్రగాయాలు

కేరళ నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన బాబు, వినీష్‌లను కోజికోడ్ మెడికల్ కాలేజీకి, సుధీర్, సునీల్‌లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంపై క్రూడ్ బాంబు విసిరినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఐ, ఆరెస్సెస్ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి.

కాగా, కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలు వరుసగా హత్యకు గురవుతుండడం వెనక ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఉందని, అతని తల తెచ్చిచ్చిన వారికి కోటి రూపాయలు నజరానా ఇస్తానని మధ్యప్రదేశ్‌కు చెందిన 'షా ప్రచార్ ప్రముఖ్' కుందన్ చంద్రావత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అలా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆరెస్సెస్‌ కార్యాలయంపై బాంబు దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీపీఎం కార్యాలయం దగ్ధం

కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కుందన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో వివాదానికి తెరతీశాయి. గురువారం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేయగా.. తాజాగా సీపీఎం కార్యాలయంపైనా దాడి జరిగింది. కోజికొడెలోని సీపీఎం కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

English summary
Three Rashtriya Swayamsevak Sangh workers were injured after a bomb was hurled at the saffron outfit's office in Kerala's Kozhikode district on Thursday, said reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X