• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయన్ సంచలనం: అల్లుడికి అందలం -కేరళ కొత్త మంత్రులు వీరే -శైలజకు షాక్ -స్పీకర్‌గా ఎంబీ రాజేశ్

|

విధానాలు, విలువల్లో బూర్జువా, ప్రాంతీయ పార్టీలకు తాము భిన్నంగా ఉంటామని చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీలు వ్యవహారంలో సాధారణ సూత్రాలనే ఫాలో అవుతాయని సీపీఎం పార్టీ మరోసారి నిరూపించింది. కరోనా విలయకాలంలో కేరళను గట్టెక్కించడంతోపాటు అటు కేంద్రంలోని మోదీని గట్టిగా ఢీకొడుతూ, అంతర్జాతీయంగా పాపులారిటీ సాధించిన ఆరోగ్య మంత్రి కేకే శైలజను కేబినెట్ నుంచి తప్పించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. అంతకంటే సంచలన రీతిలో తన అల్లుడు(బిడ్డ భర్త)కు మంత్రివర్గంలో చోటు కల్పించారు..

షాక్: జగన్‌కు చర్చి, మసీదు కనపడవా -హిందూ ఆలయాల్లో కొవిడ్ సెంటర్లపై టీడీపీ,బీజేపీ వ్యతిరేకత,విమర్శలుషాక్: జగన్‌కు చర్చి, మసీదు కనపడవా -హిందూ ఆలయాల్లో కొవిడ్ సెంటర్లపై టీడీపీ,బీజేపీ వ్యతిరేకత,విమర్శలు

కేరళ కొత్త కేబినెట్ సిద్ధం

కేరళ కొత్త కేబినెట్ సిద్ధం

దక్షిణాది రాష్ట్రం కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన చాలా రోజులకు కొత్త కేబినెట్ సిద్ధమైంది. మొత్తం 140 స్థానాలున్న అసెంబ్లీలో ఎల్డీఎఫ్ కూటమి 99 సీట్లు గెల్చుకుని అధికారాన్ని నిలబెట్టుకోగా, ప్రతిపక్ష యూడీఎఫ్ 41సీట్లతో సరిపెట్టుకుంది. కేరళలో మొత్తం 20 కేబినెట్ బెర్తులు ఉండగా, ఎల్డీఎఫ్ కూటమిలో అతిపెద్ద పార్టీ సీపీఎంకు 12, సీపీఐ 4, కేరళ మణి కాంగ్రెస్, జేడీఎస్ లకు చెరో మంత్రి పదవి, మిగిలిన నాలుగు చిన్న పార్టీలకు రొటేషన్ పద్ధతిపై రెండు మంత్రి పదవులు పంచుకోనున్నారు. ఈనెల 20న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సీఎం పనరయి విజయన్ తోపాటు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి మినహా పాత కేబినెట్ మొత్తాన్నీ పక్కనపెట్టేసి, అంతా కొత్తవారికే అవకాశం కల్పించడం గమనార్హం. మంత్రి పదవులు దక్కినవారిలో..

tirumala: బిచ్చగాడి ఇంట్లో రూ.10లక్షలు -అంతా స్వాధీనం చేసుకున్నTTD - అసలేం జరిగిందటే..tirumala: బిచ్చగాడి ఇంట్లో రూ.10లక్షలు -అంతా స్వాధీనం చేసుకున్నTTD - అసలేం జరిగిందటే..

ఇదీ కొత్త మంత్రుల జాబితా..

ఇదీ కొత్త మంత్రుల జాబితా..

కేరళ కేబినెట్ లో సీపీఎం నుంచి మంత్రి పదవులు దక్కినవారిలో ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పి.రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చేరియన్, వి.శివన్ కుట్టి, మొహ్మద్ రియాజ్, ఆర్.బిందు, వీణా జార్జ్, వి.అబ్దు రహవాన్ లు ఉన్నారు. ఇక సీపీఐ మంత్రుగా కె.రాజన్, పి.ప్రసాద్, జేఆర్ అనిల్, చిన్జు రాణి ఉంటారు. కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా సీపీఎం తీసుకుంది. పాలక్కాడ్ మాజీ ఎంపీ, ప్రస్తుతం త్రితాళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఎంబీ రాజేశ్ ను అసెంబ్లీ స్పీకర్ గా ఎంపిక చేశారు.

సీఎం అల్లుడికి మంత్రి పదవి..

సీఎం అల్లుడికి మంత్రి పదవి..


కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో కొత్తగా మంత్రి పదవులు పొందినవారిలో మొహ్మద్ రియాజ్ పేరు అందరినీ ఆకర్షించడంతోపాటు సదరు నిర్ణయం సంచలనంగానూ మారింది. ఎందుకంటే మొహ్మద్ రియాజ్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(77) కన్నూర్‌ జిల్లా ధర్మదామ్‌ నుంచి, ఆయన అల్లుడు రియాజ్(44) కోజికోడ్‌ జిల్లా బేపోర్‌ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విజయన్‌ కూతురు వీణ, రియాజ్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. అందరూ కొత్తవాళ్లనే మంత్రులుగా నియమించుకోవాలని సీఎం విజయన్ భావించడంతో అల్లుడికి అవకాశం దక్కింది. పాత మంత్రుల్లో శైలజ ఒక్కరినైనా కొనసాగించాల్సిందిగా పార్టీ హైకమాండ్ నుంచి వత్తిడి వచ్చినా విజయన్ ఖాతరు చేయలేదు. కరోనా సమయంలో బాగా పనిచేసినందుకు శైలజ ఒక్కదానికి మినహాయింపు ఇవ్వడం సరికాదని సీఎం కరాకండిగా చెప్పడంతో బృందా కారత్ లాంటి నేతలూ ప్రయత్నాలు విరమించుకున్నారు. కాగా, పార్లమెంటరీ సెక్రటరీ హోదాలో శైలజకు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారు.

పినరయి ప్రమాణానికి ప్రతిపక్షం దూరం

పినరయి ప్రమాణానికి ప్రతిపక్షం దూరం

కేరళ సీఎంగా పినరయ్ విజయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాబోమంటూ ప్రతిపక్ష యూడీఎఫ్ ప్రకటించింది. కరోనా వేళ 500 మందితో ప్రమాణ కార్యక్రమం నిర్వహించడాన్ని యూడీఎఫ్ తప్పుపట్టింది. సీఎం, కేబినెట్ ప్రమాణాల కార్యక్రమాన్ని బహిష్కరించనప్పటికీ, సభకు దూరంగా ఉంటామని, వర్చువల్ ద్వారా మాత్రమే కార్యక్రమాన్ని వీక్షిస్తామని యూడీఎఫ్ కన్వీనర్ హుస్సేన్ మంగళవారం మీడియాకు తెలిపారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. దీనికి 500 మంది హాజరవుతున్నారు. ఆహ్వానితుల కోటా కింద 500 పాసులు జారీ చేశారు. మరోవైపు..

శైలజ విషయంలో వినతులు ఫెయిల్

శైలజ విషయంలో వినతులు ఫెయిల్

కేరళ అసెంబ్లీ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో రికార్డు నెలకొల్పిన ఆరోగ్య మంత్రి కేకే శైలజకు సీఎం విజయన్ భారీ షాకిచ్చారు. కరోనా ఫస్ట్ వేవ్, నిఫా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె ‘రాక్‌స్టార్' హెల్త్ మినిస్టర్‌గా పేరొందారు. యూకే నుంచి వెలువడే మ్యాగజైన్‌ ఒకటి.. ఆమెను ‘టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020'గా ఎంపిక చేసింది. పాత మంత్రుల్లో శైలజ ఒక్కరినైనా కొనసాగించాల్సిందిగా పార్టీ హైకమాండ్ నుంచి వత్తిడి వచ్చినా విజయన్ ఖాతరు చేయలేదు. కరోనా సమయంలో బాగా పనిచేసినందుకు శైలజ ఒక్కదానికి మినహాయింపు ఇవ్వడం సరికాదని సీఎం కరాకండిగా చెప్పడంతో బృందా కారత్ లాంటి నేతలూ ప్రయత్నాలు విరమించుకున్నారు. కాగా, పార్లమెంటరీ సెక్రటరీ హోదాలో శైలజకు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారు. శైలజకు మంత్రి పదవి దక్కపోవడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ సహా లక్షల మంది నెటిజన్లు సీపీఎంపై విమర్శలు చేశారు.

English summary
The ruling Communist Party of India (Marxist) on Tuesday sprang a surprise by dropping all ministers of the outgoing Pinarayi Vijayan government. The most notable among them is health minister KK Shailaja, who was the face of the fight against pandemic in the state. Only Vijayan has retained his spot and his son-in-law, PA Mohamad Riyas, is among his new Cabinet colleagues. Party secretary A Vijayaraghavan’s wife R Bindu also figured in the new ministry. LDF parties on tuesday announsed their ministers list. Former Lok Sabha MP MB Rajesh was elected the Kerala assembly Speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X