వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: అయ్యప్పస్వామితో పెట్టుకుని అడ్రస్ లేకుండా పోయారు, పందలం బీజేపీ వశం, తిక్క కుదిరింది !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కొచ్చి. పందలం: ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని నానా రచ్చ చేసిన LDF పార్టీకి పందలం మునిసిపాలిటీ ప్రజలు సినిమా చూపించారు. మీరు అయ్యప్పస్వామితోనే పెట్టుకుంటారా ?, మా మనోభావాలు దెబ్బ తీస్తారా ?, మీ కథ చూస్తాం, మీ అడ్రస్ లేకుండా చేస్తాం అంటూ ఇన్ని రోజులు సమయం కోసం వేచి చూసిన పందలం మునిసిపాలిటీ ప్రజలు ఇంతకాలం అధికారంలో ఉన్న ఎల్ డీఎఫ్ కు చుక్కలు చూపించారు. పందలంలో బీజేపీకి పట్టం కట్టి మునిసిపాలిటీలో అందలం ఎక్కించడంతో ఎల్ డీఎఫ్ పార్టీ నేతలు కంగుతిన్నారు. ఎల్ డీఎఫ్ తిక్క కుదిర్చిన పందలం ప్రజలకు పందలం రాజకుటుంబ సభ్యులు ధన్యవాదాలు చెప్పారు.

Recommended Video

Kerala Local Body Polls : NDA secures the Pandalam Municipality

kerala: అమ్మతోడు ఒక్క ఓటు కూడా పడలేదు, సున్నా ఓట్లతో రికార్డు బ్రేక్, సమయం లేదు మిత్రమా... పారిపో !kerala: అమ్మతోడు ఒక్క ఓటు కూడా పడలేదు, సున్నా ఓట్లతో రికార్డు బ్రేక్, సమయం లేదు మిత్రమా... పారిపో !

 అయ్యప్పస్వామితో రాజకీయాలు

అయ్యప్పస్వామితో రాజకీయాలు

శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలోకి 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని కేరళలోని ఎల్ డీఎఫ్ నేతలు నానా హంగామా చేశారు. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి మద్దతు ఇవ్వాలని ఆందోళన చేసిన మహిళా సంఘాలకు ఎల్ డీఎఫ్ నేతలు బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. అయ్యప్పస్వామితోనే మీరు రాజకీయాలు చేస్తారా ? అంటూ పందలంలోని ప్రజలు మండిపడ్డారు.

 అధికార అహంకారాం

అధికార అహంకారాం

శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలోకి 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని కేరళలోని పందలం మునిసిపాలిటి (శబరిమల ఆలయం ఇక్కడే ఉంది) ఎల్ డీఎఫ్ నేతలు చేసిన డిమాండ్లను పందలం రాజకుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. శబరిమల ఆలయం గతంలో పందలం రాజకుటుంబ సభ్యుల ఆధీనంలో ఉండటంతో ఆ రాజకుటుంబ సభ్యులు మహిళల ప్రవేశానికి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.

 మీకేం పోయేకాలం వచ్చింది ?

మీకేం పోయేకాలం వచ్చింది ?

ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీళ్లేదని, మీ రాజకీయాల కోసం చరిత్రను మార్చడం కుదరదని రాజకుటుంబ సభ్యులు అప్పట్లో లేల్చిచెప్పారు. అయితే హిందువుల మనోభాలతో చెలగాటం ఆడుతున్నారని పందలంలోని హిందువులు మీకు ఏం పోయేకాలం వచ్చింది అంటూ ఎల్ డీఎఫ్ నేతల మీద కారాలు మిరియాలు నూరారు.

 అధికార పార్టీకి సినిమా చూపించారు

అధికార పార్టీకి సినిమా చూపించారు

ఈనెల డిసెంబర్ 8. 10. 14వ తేదీల్లో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పందలం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. 2015లో పందలం మునిసిపాటి ఎన్నికల్లో ఎల్ డీఎఫ్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 2020 డిసెంబర్ లో జరిగిన పందలం మునిసిపాలిటీ ఎన్నికల్లో అధికార ఎల్ డీఎఫ్ పార్టీ నేతలకు స్థానిక ఓటర్లు సినిమా చూపించారు.

 శబరిమలలో బీజేపీ హవా

శబరిమలలో బీజేపీ హవా

పందలం (శబరిమల) మునిసిపాలిటీలోని 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పందలం మునిసిపాలిటీలోని 17 వార్డుల్లో ఎన్డీఏ (బీజేపీ) అభ్యర్థులు విజయం సాధించారు. ఇంతకాలం పందలంలో అధికారంలో ఉన్న ఎల్ డీఎఫ్ పార్టీ కేవలం 7 వార్డుల్లో విజయం సాధించింది. యూడీఎఫ్ ఐదు వార్డులో విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో వివిద పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. హిందువుల మనోభావాలతో గేమ్స్ ఆడిన మీకు ఇప్పుడు బుధ్ది వచ్చిందా అంటున్నారు పందలం మునిసిపాలిటీ ప్రజలు.

 శబరిమలలో సీన్ రివర్స్

శబరిమలలో సీన్ రివర్స్

2015లో పందలంలో జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు కేవలం 7 వార్డుల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా 17 వార్డుల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించి ఎవ్వరి మద్దతు లేకుండా పందలం మునిసిపాటీలో అధికారంలోకి రావడంతో బీజేపీ నాయకులు పండగ చేసుకుంటున్నారు.

English summary
Kerala Civic Polls results 2020: NDA secures the Pandalam (Sabarimala) Municipality which was ruled by the LDF.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X